Bigg Boss 9 Telugu Elimination: వీకెండ్ వచ్చేసింది. అంటే బిగ్ బాస్ ప్రియులకు పండగే. కింగ్ నాగార్జున వచ్చేస్తారు. కంటెస్టెంట్స్ లెక్కలన్ని తేల్చేస్తారు. ఈ వారం ఎవరూ నాగ్ తిట్లు తింటారో, ఎవరో ప్రశంసలు అందుకుంటారో చూడాలి. అలాగే ఈ వారం హౌజ్ నుంచి ఒకరు వీడే సమయం కూడా వచ్చేసింది. దీంతో ఈ ఏడో వారం ఎలిమినేషన్పై ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నామినేషన్లో ఉన్నవారంత స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. దీంతో ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని ముందు నుంచి ఉత్కంఠ నెలకొంది. మరీ హౌజ్ నుంచి బయటకు వచ్చేది ఎవరో చూద్దాం!
ప్రస్తుతం బిగ్ బాస్ 9 తెలుగు ఏడో వారంకి వచ్చేసింది. గత వారమే వైల్డ్ కార్డ్స్ రాకతో ఇప్పుడే బిగ్ బాస్ ఆసక్తిగా మారింది. ఆటలో ఎవరి స్టాటజీలు వాళ్లు వాడుతూ షోని రక్తి కట్టిస్తున్నారు. ఇక పచ్చళ్ల పాప రమ్య వచ్చిరాగానే రీతూ, డిమోన్ లవ్ ట్రాక్పై ఫోకస్ పెట్టింది. వారిద్దరి ట్రాక్ తప్పించి.. తన లైన్లోకి రావాలనుకుంది. అందుకే డిమోన్కి రీతూ జన్యున్ లేదంటూ వీరిద్దరి మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నం చేసింది. ఎవేవో చెబుతూ డిమోన్ని మార్చి తను ట్రాక్లో వద్దామనుకుంది. పవన్ అంటే ఇష్టమని కూడా బహిరంగంగానే చెప్పేసింది. దీంతో హౌజ్లో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, రెండో వారం అదేది కనిపించలేదు.
పైగా గతవారం నాగార్జున ముందు తమ్ముడు అని పిలిచి అందరికి షాకిచ్చింది. ఇక తొలి వారం డిమోన్-రీతూ ట్రాక్పై పడి కాస్తో కూస్తో కంటెంట్ ఇచ్చిన రమ్య.. అసలు ఈ వారం ఎక్కడ కనిపించలేదు. నామినేషన్లో మాత్రం బిగ్ బాస్‌ని లవ్వులా పార్క్గా మార్చారంటూ తనూజపై రెచ్చిపోయింది. అక్కడ తప్ప రమ్య మళ్లీ ఎక్కడ కనిపించలేదు. టాస్క్ల్లోనూ పెద్దగా యాక్టివ్గా లేదు. వాంటెడ్ పేటలో అయితే డబ్బులు కూడా సంపాదించలేకపోయింది. ఉన్న కాస్తా డబ్బులను టీంలో వాళ్లకి ఇచ్చేసింది. దీంతో ఈ వారం నామినేషన్లో ఉన్న రమ్మకు అందరి కంటే తక్కువ ఓట్ల పడ్డాయి. ప్రస్తుతం సోషల్ మీడియా బజ్ ప్రకారం.. లీస్ట్ లో ఉన్న రమ్య ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందట.
Also Read: Ayesha Eliminated: నాకిష్టమైంది నాతో ఉండదు.. ఆయేషా ఆవేదన, కన్నీటితో హౌజ్ని వీడిన రౌడీ బేబీ
ఈ వారం తనూజ, కళ్యాణ్ పడాల, దివ్య, సంజన, సాయి, రాము రాథోడ్, రమ్య మోక్ష, రీతూలు నామినేషన్లో ఉన్నారు. అందరి కంటే ఎక్కువ ఓట్లు కళ్యాణ్ కి లీస్ట్ ఓట్లు రమ్యకే ఉన్నాయి. ఇక రమ్య తర్వాత శ్రీనివాస్ సాయికి తక్కువ ఓట్లు ఉండటంతో వీరిద్దరు డేంజర్లో జోన్లో ఉన్నారు. ఈ వారంలో వీరిద్దరి మధ్య జరిగిన నామినేషన్ సేఫ్ ప్రక్రియలో సాయి సేఫ్ అయ్యి.. రమ్య అవుట్ అయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న రమ్య హౌజ్లో చివరి వరకు అలరిస్తుందని అనుకున్నారు. కానీ, ఇలా రెండు వారాలకే ఆమె బయటకు రావడం ఫ్యాన్స్ షాకిస్తుంది. అయితే రమ్య ఎలిమినేషన్పై మరింత క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.