Virat Kohli: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India, 3rd ODI) మధ్య మూడవ వన్డే జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బౌలింగ్ సమయంలో ఆకట్టుకున్న టీమిండియా ఇప్పుడు బ్యాటింగ్ లో కూడా దుమ్ము లేపుతోంది. ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన టీమిండియా 100 పరుగులు పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సింగిల్ పరుగు తీసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.
ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటికే రెండు మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ మూడవ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ డకౌట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అందరి టెన్షన్ కు చెక్ పెడుతూ, సింగిల్ పరుగు తీశాడు విరాట్ కోహ్లీ. దీంతో డకౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం సెంచరీ చేసిన రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక అటు విరాట్ కోహ్లీ సింగిల్ తీయడంతో ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సింగిల్ తీసిన అనంతరం విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. స్పిన్నర్ అలాగే ఫాస్ట్ బౌలర్ అన్న తేడా లేకుండా ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు విరాట్ కోహ్లీ.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడవ వన్డే నేపథ్యంలో కంగారు ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. వన్డేలలో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు హెడ్. కేవలం 76 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డును క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ రికార్డు కూడా బద్దలు కొట్టాడు. 79 ఇన్నింగ్స్ లలో 3 వేల పరుగులు చేశాడు స్మిత్. అయితే ట్రావిస్ హెడ్ మాత్రం 76 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డు క్రియేట్ చేశాడు. వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డ్ సృష్టించాడు. హెడ్, స్మిత్ తర్వాత బెవెన్ 80 ఇన్నింగ్స్ లలో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బేలీ, డేవిడ్ వార్నర్ వరుసగా ఈ లిస్టులో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్ లో బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్ 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అటు 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసిన ఆస్ట్రేలియా… ఓటమి దిశగా పయనిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఈ మ్యాచ్ గెలిచిపించేలా కనిపిస్తున్నారు.
Virat Kohli celebrates 1 run 😭
At this point, he is just enjoying cricket pic.twitter.com/vsDx40cobB— Dinda Academy (@academy_dinda) October 25, 2025