EPAPER

YS Jagan Mohan Reddy: తిరుమల భక్తులపై జగన్ ప్రభుత్వం కుట్ర?

YS Jagan Mohan Reddy: తిరుమల భక్తులపై జగన్ ప్రభుత్వం కుట్ర?

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమే మహా భాగ్యంగా భావిస్తారు చాలామంది. స్వామి వారి దర్శనం క్షణమైనా చాలు.. తమ బాధలు తుడిచిపెట్టుకుపోతాయనే నమ్ముతారు. వెేంకటేశుడి క్షణకాల దర్శనం కోసం ఎన్ని కష్టాలనైనా భరిస్తారు-ఆస్వాదిస్తారు. అలాంటిది.. స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గింది. 2014 నుంచి 2019 వరకు రోజుకు సగటున స్వామి వారిని 85 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 2019 నుంచి 2024 వరకు రోజుకు యావరేజ్‌గా 65 వేల మంది మాత్రమే స్వామి వారిని దర్శించుకున్నారు. అంటే శ్రీవారి దర్శనానికి రోజుకు 20 వేల మంది చొప్పున తగ్గిపోయారు. దీనికి కారణాలేంటనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. భక్తులకు కావాలనే తిరుమలకు రాకుండా చేశారా? భక్తుల నియంత్రణకు కుతంత్రాలు చేశారా అనే వాదన తెరపైకి వస్తోంది.

కలియుగ ప్రత్యేక్షదైవం శ్రీనివాసుడికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారు. వారి మనోభావాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ స్వామి దర్శనం కల్పించాల్సిన బాధ్యత టీటీడీది. ఇదే బోర్డు ప్రథమ విధి. కానీ కొంత కాలంగా టీటీడీ వ్యవస్థలో, పనితీరులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. లఘు దర్శనం అని మొదట్లో ప్రవేశ పెట్టింది. తర్వాత కొంతకాలానికి మహాలఘు దర్శనం స్టార్ట్ చేసింది. ఇంత చేస్తున్నా అది భక్తులకు మేలు చేసే విధంగా లేదు. అధికారుల తీరు పాలకుల వైఖరితో భక్తులు విసిగిపోయారు. తిరుమలకు భక్తుల రాక తగ్గిపోయింది. గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి అని లెక్కలు చెప్తున్నాయి.


గత ఐదేళ్లలో అధికారులు, పాలక మండలి పనితీరుపై అనేక విమర్శలు వచ్చాయి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో భక్తుల రద్దీని తగ్గించడానికి ప్రయత్నాలు విస్తృతంగా జరిగాయనే టాక్‌ ఉంది. డైరెక్ట్‌గా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గానే తిరుమలకు భక్తులు రాకుండా కొన్ని చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో టీటీడీలో కొందరు అధికారులు ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్లారని చెప్పుకుంటారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం కూడా భక్తుల తగ్గుదలకు కారణమనే వాదన ఉంది.

Also Read:  చట్టసభల్లో వైసీపీ బలమెంత… ఇప్పటికీ జగన్ దే హవానా ?

సిఫార్సులు చేసిన వారికి దర్శనాలు, సేవలు లభిస్తే చాలనే రీతిలో కొందరు నాయకులు, అధికారులు కొండపై వ్యవహరించారు. సీఎంతో పాటు దేవాదాయశాఖ మంత్రి ఎప్పుడూ రివ్యూలు కూడా చేయలేదని ఈ ప్రభావం కూడా భక్తుల తగ్గుదలకు కారణమైందనే వాదన తెరపైకి వస్తోంది. 2019-2024 మధ్య వీఐపీల దర్శనం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మార్చారు. దీంతో సామాన్య భక్తులు నానా అవస్థలు పడ్డారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు మంచీనీళ్లు కూడా కరువయ్యాయని ఘాటు విమర్శలు వెల్లువెత్తాయి. కొండపై ఆధునీకరణ పేరుతో గదులకు ఇబ్బడి మొబ్బడిగా రేట్లు పెంచి.. సామాన్యులకు దొరక్కుండా చేశారని ఆరోపణలున్నాయి. ఇలాంటి చర్యల వల్ల సగటు భక్తులు ఇబ్బంది పడే దారుణ స్థితికి తెచ్చారు.

2019-24 మధ్య కరోనాతో కొంత కాలం గడిచిపోయింది. తర్వాత అధికారులు కొత్త ప్రయోగాలు చేశారు. దీనికి భక్తులు బలయ్యారు. టైం స్లాట్‌ పేరుతో భక్తులకు చాలా వరకు నియంత్రించారని తెలుస్తోంది. టైం స్లాట్‌ ఉంటేనే భక్తులకు అనుమతిస్తారని అనుకున్నారు. అప్పట్లో గోవిందరాజ సత్రాల దగ్గర తొక్కిసలాట సైతం జరిగింది. చాలా మంది భక్తులకు గాయాలు అయ్యాయి. అది పెద్ద వివాదంగా మారింది. దీంతో అధికారులు తేరుకొని సర్వ దర్శనానికి అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. మొత్తం టైం స్లాట్, ప్రత్యేకప్రవేశ దర్శనం పేరుతో సుమారు 62 వేలవరకు టికెట్లు మంజూరు అవుతున్నాయి. సర్వ దర్శనానికి వస్తున్న వారు మామూలు రోజుల్లో 5 వేలు, రద్దీ రోజుల్లో 10 వేల వరకు ఉంటున్నారు. సగటున 65 వేలమంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. ఈ లెక్కన నెలకు ఏకంగా 30 నుంచి 40 లక్షల మంది భక్తులు రద్దీ తగ్గిపోయింది.

టీటీడీ పాలకమండలి కేవలం తమ దర్శనాలు చేసుకోవడానికి మాత్రమే ఉందా అన్నట్లు వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి. ఏనాడు పాలక మండలి సభ్యులు అన్నదాన సత్రాన్ని పరిశీలించలేదు. క్యూలైన్లలో భక్తుల అవస్థలను చూడలేదు. ఫిర్యాదులపై సరిగా స్పందించనూ లేదు. భక్తుడు అనే వాడు ఉన్నాడా అని కూడా అలోచించలేదనే విమర్శలు వచ్చాయి.

నేటి సర్కారైనా.. భక్తుల మనోభావాలు దెబ్బ తీయకుండా.. వారి అభిమతం మేరకు.. స్వామివారి దర్శనాన్ని కల్పించాలని గట్టిగా కోరుతున్నారు. స్వామి దర్శనాన్ని నేత్ర పర్వంగా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేద, ధనిక తేడా లేకుండా స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యాన్ని సక్రమంగా కల్పించాలని భావిస్తున్నారు.

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×