EPAPER

Mynampally: పెట్రోల్ బంకులను కూడా హైడ్రా కూల్చివేయాలి: మైనంపల్లి

Mynampally: పెట్రోల్ బంకులను కూడా హైడ్రా కూల్చివేయాలి: మైనంపల్లి

Ex- MLA Mynampally Hanumanth Rao Comments on BRS: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తాజాగా హైడ్రాపై మరోసారి స్పందించారు. మంగళవారం ఆయన సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కపూర్ లోని మల్లన్న సాగర్ ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా పలు పెట్రోల్ బంకులు వెలిశాయని, వాటిపై కూడా హైడ్రా కొరడా ఝుళిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇటు పలు ప్రైవేట్ కాలేజీలను కూడా అక్రమంగా ఏర్పాటు చేసి, వాటిని నడిపిస్తున్నారని.. వాటిపై కూడా హైడ్రా ఫోకస్ చేసి, వాటిని డిమాలిష్ చేయాలన్నారు.


Also Read: అమెరికాలో చదువుకున్నావ్ నీకు కామన్ సెన్స్ ఉందా… కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

హైడ్రాపై మీ హైడ్రామా ఆపండి


‘హైడ్రాపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోంది. హైడ్రా విషయంలో లేనిపోని ఆరోపణలు చేసి తెలంగాణను అల్లకల్లోలం చేసే యోచనలో కేటీఆర్, హరీశ్ రావులు కుట్రలు పన్నుతున్నారు. అందుకే వారు ఆందోళనల పేరుతో హైడ్రామా చేస్తున్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కొంతమంది బీఆర్ఎస్ నేతలకు కాలేజీలు, పెట్రోల్ బంకులు అక్రమంగా ఉన్నాయి. వాటిన్నిటినీ పేదల పేర్లతో అక్రమంగా నిర్వహిస్తున్నారు. వీటిపై కూడా హైడ్రా ఫోకస్ పెట్టి, కూల్చివేయాలి.

చెరువులను, నాలాలను, ప్రభుత్వ భూములను రక్షించాలనే మంచి ఉద్దేశంతో హైడ్రాను ప్రభుత్వం ప్రారంభిస్తే బీఆర్ఎస్ నేతలు కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా, అవమానకరంగా పోస్టులు పెడుతున్నారు. గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాకు గురయ్యాయి. వారి పాలనలో ఏ పని జరగాలన్నా కమీషన్లు కంపల్సరీ. మీరు ఎక్కడా కూడా కమీషన్లు తీసుకోలేదని.. కేటీఆర్, హరీశ్ రావు ప్రమాణం చేయగలరా..?’ అంటూ మైనంపల్లి సవాల్ విసిరారు.

‘హైడ్రాపై హరీశ్ రావు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది. కోల్గురులో పేదల ప్రజల ఇళ్లను బుల్డోజర్లతో హరీశ్ రావు స్వయంగా కూల్చివేయించాడు. ఇప్పుడు తాను సుద్దపూస లెక్క హైడ్రా బుల్డోజర్లకు అడ్డం పడుకుంటా అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. మీ పాలనలో రైతులను పోలీసులతో కొట్టించారు. ఆ ఘనత రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే దక్కింది. హైడ్రా బాధితులకు పరిహారం ఇవ్వాలంటూ హైడ్రామా చేస్తున్న హరీశ్ రావు.. మల్లన్న సాగర్ నిర్వాసితుల గోడును కూడా పట్టించుకోవాలి. గత బీఆర్ఎస్ పాలకల మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించదు. కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే పేదల ప్రభుత్వం. పేదల కోసం మేం ప్రాణాలివ్వడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.

Also Read: అంబర్‌పేటలో కేటీఆర్‌కు ఊహించని షాక్.. డిప్రేషన్‌లోకి కేసీఆర్?

పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకుంది. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చల విడిగా డబ్బును ఖర్చు చేసింది. ఆ తరువాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేసింది. పాపం వెంకట్రామిరెడ్డిని మెదక్ ఎంపీగా పోటీ చేపించి బలి పశువును చేశారు. ఆ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డితో రూ. 250 కోట్ల వరకు ఖర్చు పెట్టించారు’ అని ఆయన అన్నారు.

Related News

Malla Reddy – CM Revanth: సీఎం రేవంత్‌ని కలిసిన మల్లారెడ్డి.. రాజకీయాలపై చర్చ

TG DSC 2024: తెలంగాణలో కొత్త టీచర్లకు నియామక పత్రాలు, సీఎం రేవంత్ న్యూరికార్డ్

Revanth On Musi River: విపత్తులు అరికట్టాలంటే తప్పదు.. అందరికీ న్యాయం చేస్తామన్న సీఎం రేవంత్

Saddula Bathukamma 2024: కన్నుల పండుగగా సద్దుల బతుకమ్మ…ప్రాముఖ్యత ఇదే !

Hyderabad Metro Rail: మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు.. 5 కారిడార్లకు రూ.24,269 కోట్ల వ్యయం

Harishrao: పండుగ సమయంలోనూ జీతాలివ్వరా..? ఇదేనా ప్రజా పాలన..? : హరీష్ రావు

SC Sub-Categorisation: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే..

×