Jagan: అధికారం పోయిన తర్వాత జగన్‌కు జ్ఞానోదయం అయ్యిందా? ఇంటా బయటా ఆరోపణలతో అధినేత ఆలోచన మారిందా? మళ్లీ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసే పనిలో పడ్డారా? సమీక్షా సమావేశాల్లో కేడర్‌ని ఉత్సాహపరిచేందుకు ఎలాంటి స్కెచ్ వేశారు? ఓల్డ్ ఫార్ములాను తెరపైకి తెస్తున్నారా? అధినేతను మళ్లీ నమ్ముతారా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను వెంటాడుతోంది.
అధికారం పోయిన తర్వాత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం.. కనీసం ఆయన్ని టచ్ చేయలేదు. అధికారంలో చేసిన పనికి ఆయన చుట్టూ ఉన్న నేతలు, అధికారులు బలైపోతున్నారు. నేతలపై కేసులు.. అధికారులపై వేటు. ఇవన్నీ తట్టుకోలేక పలువురు నేతలు వలసపోవడం మొదలుపెట్టారు. చివరకు ఏపీలో వైసీపీ ఉందా? అనే స్థాయికి పడిపోయారు.
పార్టీ వాళ్లు కాకుండా ఎన్నారై నేతలు సైతం జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్.. వైఎస్ వారసుడు కాదని కాసింత ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇక జగన్ పనైపోయిందని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. పరిస్థితి గమనించిన జగన్, పార్టీని కిందిస్థాయి నుంచి నిర్మించే పనిలోపడ్డారు. కేడర్‌లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించే పనిలో నిమగ్నమయ్యారు.
జగన్ కొత్త గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. 2011లో అనేక సవాళ్లలో పార్టీని నడిపించారు. జగన్ అరెస్టుకు తోడు రాష్ట్ర విభజన వ్యవహారం అప్పుడు కలిసొచ్చింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనే అపవాదు మూటగట్టుకుంది ఆ పార్టీ. ఫలితంగా ట్రిపుల్ డిజిట్ నుంచి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఏపీ ఓటర్లు.
ALSO READ: శ్రీవారి దర్శనం కేవలం రెండు గంటల్లో, అదెలా సాధ్యం?
జగన్ అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగుల్లో ఒకటే స్లోగన్. మీరు-నేను-దేవుడంటూ కార్యకర్తలను గాలికొదిలేశారు. దాని ఫలితమే కనీసం అసెంబ్లీ సమావేశాలకు రాని పరిస్థితి ఆ పార్టీది. వాలంటీర్ సిస్టమ్‌తో కేడర్, నేతలకు పని లేకపోకుండా చేశారు. ఓటమి కారణాలను పక్కనపెట్టేసి తిరిగి కార్యకర్తలకు యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు జగన్.
ఓటమి తర్వాత చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటమితో డీలా పడిన కార్యకర్తలకు ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ విజన్, దిశా నిర్ధేశం చేస్తున్నారు. జనవరి చివరి నుంచి ప్రతి జిల్లాలో పర్యటించిన రెండురోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
కార్యకర్తతో మాట్లాడుతానని స్పష్టం చెప్పారు జగన్. కూటమి ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు టాప్ ప్రయార్టీ ఇవ్వాలన్నది అధినేత ఆలోచన. వైసీపీ వీడినవారి స్థానంలో కొత్తగా నేతలను ఎంపిక చేయనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి-కార్యకర్తలకు గ్యాప్ లేకుండా సెట్ చేసే పనిలోపడ్డారు.
జగన్ మాటలను ఆసక్తిగా గమనించిన కేడర్ వాయిస్ మరోలా ఉంది. గతంలో నమ్మి మోసపోయామని అంటున్నారు. ఉన్నదంతా ఖర్చుపెడితే, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి తమను నట్టేట ముంచారని అంటున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థను తీసురారనే నమ్మకమేంటని అనుకుంటున్నారు. మొత్తానికి జగన్‌తోపాటు కార్యకర్తలకు జ్ఞానోదయం అయినట్టు కనిపిస్తోంది.