BigTV English

Tollywood Movies: ఈ ఏడాది బాలీవుడ్ ను షేక్ చేసిన తెలుగు సినిమాలు ఇవే..

Tollywood Movies: ఈ ఏడాది బాలీవుడ్ ను షేక్ చేసిన తెలుగు సినిమాలు ఇవే..

Tollywood Movies: 2024 లో సినిమాల సందడి ఎక్కువగానే ఉంది. సంక్రాంతి నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా పాజిటివ్ టాక్ ని అందుకోవడం మాత్రమే కాదు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి కోట్లు కొల్లగొట్టాయి. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా, మరికొన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. తెలుగు సినిమాలు నార్త్ లో రికార్డు బ్రేక్ చేయడం మామూలు విషయం కాదు. అయితే ఈ ఏడాది బాలీవుడ్ లో తెలుగు సినిమాల హవానే నడిచింది. బాలీవుడ్ లో ఏ సినిమా సత్తాను చాటిందో ఇప్పుడు తెలుసుకుందాం..


గత ఏడాది సలార్ తర్వాత పెద్దగా కొత్త సినిమాలు రాలేదు. అలాగే ఈ ఏడాది కూడా మళ్లీ బాలీవుడ్‍లో తెలుగు చిత్రాలు హవా చూపాయి. పుష్ప 2: ది రూల్ ఏకంగా హిందీ కలెక్షన్ల విషయంలో ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. అన్ని బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి.. బాలీవుడ్‍లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది బాలీవుడ్ కల్కి, హనుమాన్, దేవర వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ పుష్ప 2 హవానే ఇంకా కొనసాగుతుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ నార్త్ లో వరుస రికార్డులను బ్రేక్ చేస్తుంది. హిందీ ఇండస్ట్రీలో తెలుగు డబ్బింగ్ చిత్రం అగ్రస్థానంలో నిలిచింది. డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 తెలుగు కంటే హిందీలోనే ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టి అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది. మూడు వారాలు అయిన ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గలేదంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో క్రేజ్ ను అందుకుందో..

ఈ మూవీ ఇప్పటివరకు 800 కోట్లలకు పైగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూల్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. హిందీ నెట్‍ వసూళ్ల విషయంలో ‘స్త్రీ 2’కు కూడా వెనక్కి నెట్టి ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. ఇంకా జోరుగా కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ హీరోకు సాధ్యం కాని రికార్డు ను సొంతం చేస్తున్నాడు అల్లు అర్జున్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ప్రపంచ వ్యాప్తంగా 1600 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ నెల లోపు బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.. ఇక ఈ సంవత్సరం కల్కి 2898 ఏడీ చిత్రంతో బాలీవుడ్‍ ప్రేక్షకులను వావ్ అనిపించారు. హిందీలో ఈ మూవీ సుమారు రూ.295కోట్ల నెట్‍ కలెక్షన్లను దక్కించుకుంది.. దేవర చిత్రం హిందీలో సుమారు రూ.65కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‍తోనే రూపొందింది. ఈ మూవీ ఒక్క హిందీలోనే సుమారు రూ.54కోట్ల నెట్‍ వసూళ్లను అందుకుంది. మొత్తానికి పుష్ప 2 అరుదైన రికార్డును అందుకుంది..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×