Allu Arjun Case:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన అంశం సంధ్యా థియేటర్ ఘటన. ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వున్న సంధ్యా థియేటర్లో వేశారు. ఇక్కడ సినిమా చూడడానికి అల్లు అర్జున్(Allu Arjun)ఫ్యామిలీతో సహా రావడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ని పోలీసులు విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఆ విచారణలో భాగంగా పోలీసులు అల్లు అర్జున్ ని అడగబోయే ప్రశ్నలు ఇవే అంటూ కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అల్లు అర్జున్ ని పోలీసులు అడగబోయే ప్రశ్నలివే..
*సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షోకి వస్తున్నట్లు అనుమతి కోరారా..? ఉంటే ఆ కాపీ ఏమైనా ఉందా…?
*మీరు కానీ.. మీ PR టీమ్ కానీ.. పోలీసుల అనుమతి తీసుకున్నారా..?
*సంధ్య థియేటర్ వద్దకు మీకంటే ముందుగానే మీ PR టీమ్ వెళ్ళింది. అక్కడ ఉన్న క్రౌడ్ పరిస్థితిని మీకు వివరించారా…?
*మీరు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అయినా కూడా ఎందుకు రోడ్ షో చేస్తూ వచ్చారు..?
*థియేటర్ బయట తొక్కిసలాట జరిగిన విషయం, ఒక మహిళ చనిపోయిన విషయం, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్, ఏసీపీ మీకు చెప్పడానికి వస్తే.. మీ మేనేజర్ అడ్డుకున్నారు. నేను సార్ కి చెప్తాను అన్నాడు. మరి మీకు ఆ పరిస్థితి గురించి వివరించాడా…?
*తర్వాత డీసీపీ నేరుగా వచ్చి మీకు చెప్పాడు. కానీ.. మీరు సినిమా మొత్తం చూశాకే వస్తాను అన్నారు. ఎందుకు..?
*నాకు ఎవరూ చెప్పలేదు అని ప్రెస్ మీట్ లో చెప్పారు. పోలీసులు మీకు చెప్పినా కూడా ఎందుకు అబద్ధం చెప్పారు..?
*మరుసటి రోజు కానీ మహిళ చనిపోయిందని తెలియదు అన్నారు. కానీ మీకు ఆరోజు రాత్రే తెలుసు. ఎందుకు డైవర్ట్ చేశారు..?
ఇలా ఈ ప్రశ్నలన్నింటినీ అడగబోతున్నారట..మరి వీటన్నింటికీ అల్లు అర్జున్ సమాధానం ఎలా ఉంటుందో చూడాలి
విచారణ మొత్తం వీడియోగ్రఫీ..
ఇకపోతే మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని విచారణ చేసే సమయంలో.. ఆ విచారణ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయనున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ ని పోలీసులు అడగబోయే ప్రతి ప్రశ్న కూడా వ్యాల్యుబుల్ అని, మరి వీటన్నింటికీ అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం తెలియజేస్తారు అని యావత్ సినీ ప్రేక్షకులు, ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి బన్నీ సమాధానం ఎలా ఉంటుందో చూడాలి. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటించారు. ఈ సినిమా రూ.1600 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ సంతోషాన్ని మాత్రం బన్నీ అనుభవించలేకపోతున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.