Jagan: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అన్న సామెత జగన్-పవన్ కల్యాణ్ విషయంలో అతికినట్టు సరిపోతుంది. ఎవరు, ఎప్పుడు, ఎలా వ్యవహరిస్తారో తెలీదు కూడా. తొలిసారి పవన్ కల్యాణ్ గురించి ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.
సింగపూర్‌లో రివర్ వ్యాలీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ విషయం తెలియగానే జనసేన నేతలు, కేడర్ షాకయ్యింది. ఈ ఘటనపై ప్రధాన రాజకీయ పార్టీల నేతలు రియాక్ట్ అయ్యారు. ప్రమాద ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు.
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి తాను షాక్ అయ్యాను.ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయి. బాబు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
జగన్ ఈ విధంగా రియాక్ట్ కావడం ఇదే తొలిసారి. గతంలో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకునేవారు. అంతేకాదు వ్యక్తగతంగా ఆరోపణలు చేసుకున్నారు. ప్రస్తుతం జగన్ ట్వీట్‌పై జనసేన సైనికులు రియాక్ట్ అవుతున్నారు. ఏపీలో రాజకీయాల్లో ఇదొక మంచి సంప్రదాయంగా వర్ణిస్తున్నారు కొందరు నేతలు.
I am shocked to know about the fire accident at a school in Singapore in which @PawanKalyan garu's son, Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time. Wishing him a swift and complete recovery.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2025