BigTV English

Taiwan Man: భార్యకు వివాహేతర సంబంధం.. బయటపెట్టిన భర్తకే జైలు శిక్ష విధించిన న్యాయస్థానం!

Taiwan Man: భార్యకు వివాహేతర సంబంధం.. బయటపెట్టిన భర్తకే జైలు శిక్ష విధించిన న్యాయస్థానం!

న్యాయస్థానాల వ్యవహార శైలి కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్ని తీర్పులను చూస్తే, ఇలా ఎలా ఇచ్చారు? అని ప్రజలు షాక్ అవుతుంటారు. కొన్నిసార్లు బాధితులు, దోషులుగానూ మారుతారు. తైవాన్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. భార్య వివాహేతర సంబంధాన్ని బయట పెట్టిన భర్తకే న్యాయ స్థానం జైలు శిక్ష విదించింది. ఈ తీర్పు చూసి అందరూ సదరు వ్యక్తి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తైవాన్ కు చెందిన ఫాన్ అనే వ్యక్తికి పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తర్వాత అతడికి తన భార్య మీద అనుమానం కలిగింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్ల తెలుసుకున్నాడు. ఆమెను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. బండారం బయటపెట్టాలి అనుకున్నాడు. ఇంట్లో భార్యకు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టాడు. అతడి డౌట్ నిజమేనని తేలింది. భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ విజువల్స్ ను భార్యకు చూపించాడు. తనతో కలిసి ఉండలేనని చెప్పేశాడు. కానీ, ఆమె ససేమిరా అన్నది. వెంటనే అతడు కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నాడు.


బాధితుడినే దోషిగా తేల్చిన న్యాయస్థానం

ఫాన్ కోర్టుకు వెళ్లడంతో కథ పూర్తి మలుపు తిరిగింది. న్యాయస్థానంలో భార్య భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇంట్లో సీక్రెట్ గా కెమెరాలు పెట్టి తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా చేశాడని ఆరోపించింది. తన ప్రైవసీకి ఇబ్బంది కలిగించిన అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె వాదనతో న్యాయస్థానం పూర్తిగా ఏకీభవించింది. భర్తను దోషిగా నిర్ణయిస్తూ మూడు నెలల శిక్ష విధించింది. భార్య ఎప్పుడూ బెడ్ రూమ్ లో గడిపేదని, పిల్లలు ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడేవారని చెప్పాడు. విషయం ఏంటో తెలుసుకునేందుకు తాను కెమెరాలు పెట్టాల్సి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అయితే, ఫాన్ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది.

Read Also: మాజీ ప్రేయసి తండ్రి అస్తికలు దొంగిలించిన ప్రియుడు.. అలా చేస్తే తిరిగిస్తాడట!

ఇదేం న్యాయమంటూ నెటిజన్ల ప్రశ్నలు

ఇక తీర్పుపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మోసం చేసిన భార్యను కాదని, భర్తను శిక్షించడం ఏంటని మండిపడుతున్నారు. న్యాయస్థానంలో న్యాయం జరగకపోగా, అన్యాయం జరిగిందని ఆక్షేపిస్తున్నారు. బాధితుడైన భర్తను కోర్టు దోషిగా ప్రకటించాన్ని తప్పుబడుతున్నారు. తైవాన్ న్యాయ వ్యవస్థపూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. న్యాయస్థానం ఇలాంటి తీర్పులను ఇవ్వడం వల్ల, న్యాయ వ్యవస్థ మీద ఉన్న గౌరవం తగ్గిపోతుందంటున్నారు. ఇప్పటికైనా ఈ కేసు విషయంలో పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన భార్యకు కూడా తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అరుదైన తీర్పును అందరూ తప్పుబడుతున్నారు.

Read Also: ఐసీయూలో చిట్టీ పికెల్స్ అలేఖ్య.. కండీషన్ ఎలా ఉందంటే?

Related News

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Young president: 20 ఏళ్లకే సొంత దేశాన్ని సృష్టించి తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న యువకుడు, 400 మంది పౌరులు

Big Stories

×