Jagan: అసలే ఎండాకాలం.. ఆపై వైసీపీ విపరీతమైన ఉక్కపోత. తాజాగా లిక్కర్ కేసులో కొత్త కొత్త వ్యవహారాలు వెలుగులోకి రావడంతో కేడర్‌తోపాటు నేతలు వణుకుతున్నారు. దీనికితోడు విజయసాయిరెడ్డి నుంచి ఘాటైన విమర్శల మొదలుకావడంతో వైసీపీ రియాక్ట్ అవుతోంది. తాజాగా ఈనెల 22న పీఏసీ కమిటీతో సమావేశం కానున్నారు జగన్. భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలనేది చర్చించనున్నారు.
‘విశ్వా’సం సన్నగిల్లుతోందా?
‘విశ్వావసు’ నామ సంవత్సరం ఏమోగానీ.. వైసీపీ మాత్రం క్రమంలో విశ్వాసం కోలుపోతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నుంచి నేతలు తరలిపోవడం ఒకటైతే, లేని పోని కేసులు కొందరి నేతలను వెంటాడుతున్నాయి. ఆయా నేతలు బయటకు రాలేక తర్జనభర్జన పడుతున్నారు. ఏం చెయ్యాలన్న సందిగ్దంలో పడిపోయారు.
తాజాగా లిక్కర్ కేసు వ్యవహారం ఆ పార్టీని చికాకు పెట్టిస్తోంది. దాదాపు ఆరు నెలలు సైలెంట్‌గా ఉన్న సిట్, ఈ కేసులో దూకుడు పెంచింది. తొలుత రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసులు, బంధువులు, ఫ్రెండ్స్ , వ్యాపారాలపై దాదాపు 15 చోట్ల సోదాలు చేసింది. అందులో ఎలాంటి సమాచారం లభించిందో తెలీదు. తొలుత విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు.
దాదాపు మూడు గంటలపాటు ఆయన్ని సిట్ అధికారులు కేవలం సాక్షిగా మాత్రమే విచారించారు. ఆయన ఇచ్చిన సమాధానాలతో ఎంపీ మిథున్ రెడ్డి వంతైంది. దాదాపు ఏడు గంటలపాటు అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. 100 ప్రశ్నలకు దాదాపు అన్నింటికి ఎదురు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది.
ALSO READ: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఆ తేదీలు మరిచిపోవచ్చు
లిక్కర్ కేసులో ఉక్కపోత
ఒకవిధంగా చెప్పాలంటే విచారణకు ఏమాత్రం ఆయన సహకరించలేదన్నమాట. సంబంధం లేని ప్రశ్నలకు సమాధానాలు లేవని తప్పించుకునే ప్రయత్నం చేశారట. ఆధారాలు చూపించి అడిగితే నోరెత్తకుండా సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలినట్టు వార్తలు వస్తున్నాయి.
లిక్కర్ వ్యవహారం వైసీపీకి కాస్త ఇబ్బందిగా మారింది. నోరు విప్పాల్సిన ఫైర్ బ్రాండ్ నేతలు ప్రేక్షకుడిగా మారిపోతున్నారు. ఇదే జరిగితే పార్టీకి కష్టాలు తప్పవని అంటున్నారు. దీనికితోడు ధర్నాలు, ఆందోళనలకు దిగువ స్థాయి కేడర్ కలిసిరావడం లేదన్నది ఆ పార్టీ నేతల మాట. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులతో మంగళవారం భేటీ కానున్నారు అధినేత జగన్.
పీఏసీతో భేటీ వెనుక
వారిని నుంచి సూచనలు తీసుకున్న తర్వాత రాజకీయంగా ఎలా ముందుకు వేయాలన్నది చర్చించనున్నారు. దాని తర్వాత అడుగులు వేయనున్నారు. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23న(బుధవారం) జిల్లాల అధ్యక్షులు, సోషల్ మీడియా ప్రముఖులతో సమావేశమవు తున్నారు.
ఇప్పటివరకు కూటమిని విడగొట్టడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ మధ్య చిచ్చు పెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. వాటిని కూటమి ముందుగానే పసిగట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్యేల స్థాయి స్కెచ్ వేసింది. ఇప్పుడు దిగవస్థాయి కేడర్‌లో గొడవలు పెట్టేందుకు స్కెచ్ వేసిందన్నది తెలుగు తమ్ముళ్ల మాట. మొత్తానికి వైసీపీ నెక్ట్స్ వేయబోయే స్కెచ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.