Sreemukhi : బుల్లితెర పై టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న ఫిమేల్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తన అందం అభినయంతో ఒక్కోషోతో స్టార్ ఇమేజ్ ని అందుకుంటూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. యాంకర్ గా అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ టీవీ ప్రొగ్రామ్స్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. బుల్లితెర రాములమ్మగా కూడా గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ టెలివిజన్ రంగంలో సంచనమే సృష్టించిందని చెప్పొచ్చు.. గత కొన్ని రోజులుగా ఈమె పెళ్లి పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి శ్రీముఖి పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
సీరియల్ యాక్టర్ తో శ్రీముఖి పెళ్లి నిజమేనా..?
యాంకర్స్ అందరితో చనువుగానే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళ మధ్య కొన్ని డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. మరికొన్ని సందర్భాలలో శృతి మించిపోతోందనే టాక్ ను సొంతం చేసుకుంటారు. తాజాగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ నటుడు బాలు ( విష్ణు కాంత్ ) ఓ షోలో పాల్గొన్నారు. ఈ షోకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా శ్రీముఖి బాలుతో మాట్లాడుతూ మ్యారేజ్ ప్రపోజల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంట్లో అత్తమామ కూడా ఒప్పుకున్నారంటూ బాలులో చెప్పడం, బాలు సిగ్గు పడటంతో వేదిక మొత్తం సందడిగా మారింది. వీరిద్దరి మధ్య క్లోజ్ నెస్ ను చూసి అందరు షాక్ అవ్వడంతో పాటు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : బ్రాహ్మీణ్ కుటుంబంలో పుట్టినా.. రెండు పెళ్లిళ్లు.. తొలిసారి స్పందించిన కమల్..
శ్రీముఖి పెళ్లి పై వార్తలు..
శ్రీముఖి హైదరాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ వాటిని స్టార్ యాంకర్ శ్రీముఖి ఖండించారు. అలాంటిది ఏమీ లేదని, ఏదైనా ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు.. గతంలో ఇలాగే చాలా సార్లు వార్తల్లో నిలిచింది. ఇక బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న ఈమె సోషల్ మీడియా లో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తన గురించిన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అభిమానులతో కూడా లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ నిత్యం టచ్ లోనే ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈమె బుల్లి తెర పై పలు షోలకు హోస్ట్ గా చేస్తూ వస్తుంది. అంతేకాదు గతంలో హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది.