E-Paper
Advertisement

జగన్‌కు అస్సలు కలిసిరాని కాలం.. దెబ్బ మీద దెబ్బ, చివరకు కేసు కూడా

జగన్‌కు అస్సలు కలిసిరాని కాలం.. దెబ్బ మీద దెబ్బ, చివరకు కేసు కూడా
Advertisement

Jagan: వైసీపీ అధినేత జగన్‌కు గ్రహ స్థితి బాగా లేదా? ఒక అడుగు ముందుకేస్తే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికల మొదలు అన్నీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయా? సింపతీ కోసం ట్రై కోసం చిక్కుల్లో పడుతున్నారా? కొన్నాళ్లు మీడియా ముందుకు రాకుండా ఉండడమే బెటరని కార్యకర్తలు ఎందుకు అంటున్నారు?

జగన్‌కు అస్సలు కలిసిరాని కాలం

గడిచిన రెండు నెలలుగా వైసీపీ అధినేత జగన్ అదొలా కనిపిస్తున్నారు. ఆయన ముఖ కవలికలు పూర్తిగా మారిపోయాయి. గతంలో ధీమాగా, హుందాగా కనిపించిన ఆయన, అనేక సమస్యలు వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా లేనిపోని చికాకులు వెంటాడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు పోలింగ్ వరకు ఆయన చేయని ప్రయత్నం లేదు. హైకోర్టు మొదలు సుప్రీంకోర్టు గడప తొక్కినా ఫలితం లేకుండా పోయింది. చివరకు పులివెందుల మున్సిపాలిటీ ద్వారా పరువు దక్కించుకోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

ఆగని పులివెందుల ఎన్నికల కౌంటింగ్, జగన్‌పై కేసు

Advertisement

పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ఆపాలని జగన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీనిపై సోమవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, మంగళవారం ఉదయం తీర్పు ఇచ్చింది. పులివెందులలో రీపోలింగ్ జరపాలన్న పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో అక్కడ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఈ వ్యవహారం వైసీనీ నేతలకు మింగుడుపడడం లేదు. దీనికి బదులు స్థానిక సంస్థల ఎన్నికలకు ఆ పార్టీ దూరంగా ఉన్నా బాగుండేదని కొందరు నేతలు అంటున్నారు.

మరోవైపు పోలింగ్ రోజున పులివెందులలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు మాజీ సీఎం జగన్‌. దీంతో ఆయనపై కేసు నమోదైంది. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ రోజు ఆదివారం, వైసీపీ బూత్ ఏజెంట్లతో కలిసి పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద జగన్‌ ధర్నాకు దిగారు. హెలిపాడ్ నుంచి భారీ కాన్వాయ్‌తో పోలింగ్ బూత్ వద్దకు రావడం, అక్కడ నిరసనలు తెలపడం వంటి పరిణామాలపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాల మేరకు మాజీ సీఎం జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

ALSO READ: ఏపీలో మొదలైన మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు.. తుఫాను ప్రాంతాల్లో ఆలస్యంగా,

జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వైసీపీ నేతలు.. కొన్నాళ్లు అధినేత దూరంగా ఉంటే బెటరని అంటున్నారు. దీనికితోడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగి మీడియా ముందుకు వచ్చినప్పుడు అధినేత ట్రోల్‌కు గురవుతున్నారని, కనీసం సబ్జెక్టు తెలియకుండా రావడంతో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందని అంటున్నారు ఆ పార్టీ కేడర్. ఇదే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని సగటు కార్యకర్త బలంగా చెబుతున్నారు.

 

Related News

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈసారైనా వెళ్తారా? గుండె నొప్పి సాకుతో తప్పించుకుంటారా?

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు యువకులు మృతి!

ఏపీలో మొదలైన మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు.. తుఫాను ప్రాంతాల్లో ఆలస్యంగా, Live

ఏపీలో తీరం దాటిన ‘మురసు’ తుఫాన్.. తెలంగాణ వైపు టర్న్! మరో 24 గంటలు భారీ వర్ష సూచన

విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో పేలుడు.. ఎగసిపడిన అగ్నికీలలు, అసలు ఏం జరిగింది?

మురసు తుఫాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 45 వేల మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ఈడీ మెరుపు దాడులు.. రూ. 1,500 కోట్ల భారీ మనీలాండరింగ్ గుట్టురట్టు!

Big Stories

Advertisement
×