E-Paper
Advertisement

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈసారైనా వెళ్తారా? గుండె నొప్పి సాకుతో తప్పించుకుంటారా?

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. ఈసారైనా వెళ్తారా? గుండె నొప్పి సాకుతో తప్పించుకుంటారా?
Advertisement

Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు రోజురోజుకూ బిగుస్తోంది. రాష్ట్రంలో గతంలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరిపేందుకు, అంబటి రాంబాబు వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు రేపు తమ ఎదుట హాజరు కావాలని అధికారుల ఆదేశించారు.

మూడుసార్లు డుమ్మా.. నాలుగోసారి నోటీసులు!

Advertisement

మద్యం టెండర్ల విచారణలో భాగంగా ఈడీ ఇప్పటికే అంబటి రాంబాబుకు మూడుసార్లు నోటీసులు పంపింది. అయితే, రకరకాల కారణాలతో ఆయన ఆ మూడూ సార్లు విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. ప్రతిసారీ విచారణ నుంచి మినహాయింపు కోరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈడీ నాలుగోసారి సమన్లు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.

రేపేం జరగనుంది?

Advertisement

నోటీసుల ప్రకారం అంబటి రాంబాబు రేపు విచారణకు వెళ్తారా లేదా అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది. గతంలో లాగే ఈసారి కూడా గుండె నొప్పి లేదా ఇతర ఆరోగ్య సమస్యల పేరు చెప్పి మినహాయింపు పొందుతారా, లేక ఈడీ ముందుకు వెళ్లి తన వాదన వినిపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈసారి కూడా హాజరుకాకపోతే ఈడీ తదుపరి ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందోనని వైసీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు యువకులు మృతి!

Tags

Related News

జగన్‌కు అస్సలు కలిసిరాని కాలం.. దెబ్బ మీద దెబ్బ, చివరకు కేసు కూడా

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు యువకులు మృతి!

ఏపీలో మొదలైన మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు.. తుఫాను ప్రాంతాల్లో ఆలస్యంగా, Live

ఏపీలో తీరం దాటిన ‘మురసు’ తుఫాన్.. తెలంగాణ వైపు టర్న్! మరో 24 గంటలు భారీ వర్ష సూచన

విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో పేలుడు.. ఎగసిపడిన అగ్నికీలలు, అసలు ఏం జరిగింది?

మురసు తుఫాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 45 వేల మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ఈడీ మెరుపు దాడులు.. రూ. 1,500 కోట్ల భారీ మనీలాండరింగ్ గుట్టురట్టు!

Big Stories

Advertisement
×