Tanveer Ahmed On Mohammad Amir: ఐపీఎల్ 2027 టోర్నమెంట్ వేలం నేపథ్యంలో మహ్మద్ అమీర్ తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బ్రిటీష్ పౌరసత్వంతో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తాడని చర్చ జరుగుతోంది. అయితే, దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ అమీర్ యమ డేంజర్ అని…వాడు ఐపీఎల్‌లోకి వస్తే కోహ్లీ, రోహిత్ లాంటోళ్లు తట్టుకోలేరని హెచ్చరించాడు. అమీర్ వేసే బంతులను టీమిండియా బ్యాటర్లు తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఒక వేళ ఐపీఎల్ 2027 వేలంలోకి మహ్మద్ అమీర్ వస్తే మాత్రం, చాలా జట్టు పోటీ పడతాయని తెలిపాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి బలమైన జట్టు అతన్ని కొనుగోలు చేసేందుకు ఎగబడతాయన్నాడు.
ఐపీఎల్ 2027 టోర్నమెంట్ వేలం నేపథ్యంలో మహ్మద్ అమీర్ బరిలో ఉంటే వెంటనే కావ్య పాప అతన్ని కొనుగోలు చేయాలంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సూచనలు చేశాడు. మహ్మద్ అమీర్ సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి వస్తే, ఆ జట్టు బౌలింగ్ పరంగా చాలా బలంగా తయారవుతుందని వెల్లడించాడు. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా వీక్ గా ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు.
ఆ జట్టు బలంగా మారాలంటే అమీర్ ను తీసుకోవాల్సిందేనంటూ బాంబ్ పేల్చాడు. ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ను తీసుకున్నట్టుగానే, మహ్మద్ అమీర్ ను తీసుకోవాలని సూచించాడు. పాక్ ప్లేయర్లను తీసుకునే గుండె ధైర్యం కేవలం కావ్య పాప మాత్రమే ఉందని వ్యాఖ్యానించాడు. ఇక వేలంలో మహ్మద్ అమీర్ కనీసం రూ.10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు ధర పలుకుతాడన్నాడు. దీంతో అమీర్ ఐపీఎల్ ఎంట్రీపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఐపీఎల్ ఎంట్రీపై స్వయంగా మహ్మద్ అమీర్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఐపీఎల్ కోసం చూడటం లేదని, కేవలం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 మాత్రమే ఆడతానని ప్రకటించాడు. అవకాశం వస్తే, అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని బాంబ్ పేల్చాడు. ఐపీఎల్ అంటే తనకు నచ్చడం లేదని, ఆ టోర్నమెంట్ మొత్తం ఫిక్సింగే నడుస్తోందని ఆరోపించాడు. రూ.100 కోట్లు ఇచ్చినా ఐపీఎల్ లో ఆడేది లేదని మహ్మద్ అమీర్ పేర్కొన్నాడు.