E-Paper
Advertisement

Natural Farming: గుడ్ న్యూస్.. సేంద్రీయ వ్యవసాయం పై రైతులకు శిక్షణ..!

Natural Farming: గుడ్ న్యూస్.. సేంద్రీయ వ్యవసాయం పై రైతులకు శిక్షణ..!
Advertisement

Natural Farming: స్వేచ్ఛ బ్యూరో: అధిక దిగుబడుల కోసం రైతులు అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను పరిమితికి మించి వాడుతున్నారు. వివిధ పంటల సాగు ద్వారా బియ్యం, పప్పులు, నూనెగింజలు వంటి ఆహార పదార్థాలలో రసాయన అవశేషాలు ఉండి మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రజలకు పర్యావరణానికి మేలు చేస్తుందని భావించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాయి. అన్నదాతలను సేంద్రీయ సాగు వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా పూర్వకాలం నాటి సహజ సిద్ధ ధాన్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి.

క్లస్టర్ల చొప్పున

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ వ్యవసాయ పథకం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ నేషనల్ ఫార్మింగ్ లో భాగంగా జిల్లాలోని 12 మండలాలలో సీఆర్పీలను ఎంపిక చేసి నిపుణులతో శిక్షణలో అందించారు. జిల్లాలో మొత్తం 20 వ్యవసాయ క్లస్టర్లు గుర్తించారు.ఒక క్లస్టర్ కు 125 మంది రైతులను ఏర్పాటు చేశారు. సిఆర్పి లో ప్రస్తుతం రైతులకు సేంద్రియ వ్యవసాయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో వ్యవసాయ విస్తరణ అధికారుల పాత్ర కీలక పాత్ర పోషిస్తున్నారు.

మట్టి నమూనాలు సేకరణ

Advertisement

భూసార పరీక్షల కోసం అవసరత రైతుల పొలాల నుంచి మట్టి నమూనాను సేకరించి ల్యాబ్ లకు పంపుతున్నారు ఫలితాలు ఆధారంగా భూమి సహజ సాగు యోగ్యంగా మార్చాల్సి ఉంటుంది. వచ్చే ఖరీఫ్ నాటికి ప్రతి రైతు కనీసం ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేసేటట్లు ప్రోత్సహిస్తున్నారు.ముందుగా మహిళా సంఘాల్లోని ఇద్దరు సభ్యులను కృషి సఖీలుగా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా ఇతర రైతులకు అవగాహన కల్పించనున్నారు.

Also Read: BJP : బీజేపీ ఆశలపై మరోసారి నీళ్లు చల్లిన సీఎం రేవంత్!

జీవవైవిద్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా

Advertisement

భూమిలో సహజంగా ఉండే జీవవైద్యాన్ని పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు కీటకాలను కాపాడుకునేలా సహజ సేద్యం సాగు ఉంటుంది. పశువుల ఎరువులు లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా జీలుగా,పచ్చిరొట్ట వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియ దున్నడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందవచ్చని వ్యవసాయ నిపుణులు, స్థానికంగా ఏఈవోలు రైతులకు సూచిస్తున్నారు. సాగులో జీవన నియంత్రణ పద్ధతిలో వృక్ష సంబంధిత కషాయాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి జీవామృతంతో పురుగులను అదుపు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చు. అధిక దిగుబడులకు పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా పాటించాలి. దేశీ ఆవు పేడ, మూత్రం ఇతర సహజ పదార్థాలతో ఎరువులు తయారుచేసి వినియోగించడం ఈ పథకం లక్ష్యం. సాగు విధానం యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. అందులో మట్టిలోని పోషక విలువల కీలక భూమిక పోషిస్తాయి. రైతులు ప్రస్తుతం నత్రజని,భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాలను మాత్రమే వాడుతూ మిగతా విలువైన సూక్ష్మ పోషకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను సహజ పద్ధతిలో పెంపొందించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయం సాగు చేశా: భూపాల్ రెడ్డి కొత్తపల్లి, గద్వాల్

కొంతకాలంగా రసాయన ఎరువులు మందులు వాడటంతో దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నాం. రసాయనాలతో ఆరోగ్యం సైతం దెబ్బతింటుంది. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వరి పంటను సాగు చేశాను. ఈ విధానంలో సాగు చేయడం ద్వారా దిగుబడులు క్రమంగా పెరగడంతో పాటు రోగాలు తగ్గి ఆరోగ్యాలు మెరుపడే అవకాశం ఉంటుంది.

Also Read: E Office: తెలంగాణ సర్కార్ మరో సంచలనం.. ఇకపై అన్ని ప్రభుత్వ సేవలు ఈ-ఆఫీస్ లోనే..?

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×