E-Paper
Advertisement

Janasena vs TDP: చెట్లు సాకు మాత్రమే.. అసలు గురి రంగు రాళ్లపైనే? పెద్దమదిన ఘర్షణ వెనుక అసలు కథ ఇదే?

Janasena vs TDP: చెట్లు సాకు మాత్రమే.. అసలు గురి రంగు రాళ్లపైనే? పెద్దమదిన ఘర్షణ వెనుక అసలు కథ ఇదే?
Advertisement

Janasena vs TDP: అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెద్దమదిన గ్రామంలో నిర్వహించిన ‘రచ్చబండ’ గ్రామ సభ ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రభుత్వ భూముల్లోని అకేసియా మొక్కల నరికివేత విషయంలో అధికార కూటమికి చెందిన జనసేన , టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న అకేసియా చెట్లను తొలగించే విషయమై రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. జనసేన వర్గీయులు ఆ మొక్కలను నరికివేయాలని పట్టుబట్టగా..  టీడీపీ శ్రేణులు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రచ్చబండ సభలో ఈ విషయంపై చర్చ జరుగుతుండగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

అయితే..  ఈ గొడవకు కేవలం చెట్లు మాత్రమే కారణం కాదని ఆ భూముల్లో విలువైన రంగు రాళ్లు (Precious stones) లభ్యమవుతుండటమే అసలు కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ భూమిపై పట్టు సాధిస్తే రంగు రాళ్ల తవ్వకాల్లో లాభం పొందవచ్చనే ఉద్దేశంతోనే రెండు వర్గాలు పంతానికి పోయినట్లు సమాచారం.

మాట మాట పెరగడంతో సహనం కోల్పోయిన కార్యకర్తలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. రచ్చబండ వేదిక రక్తసిక్తంగా మారడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ALSO READ: తృటిలో తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు దిగిన కొద్దిసేటికే అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సు

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×