BigTV English

Nagababu on YCP: జగన్ పెద్ద కమిడియన్..ఇంకో 20 ఏళ్లు పండపెడ్తామ్, వర్మకూ వాతలు?

Nagababu on YCP: జగన్ పెద్ద కమిడియన్..ఇంకో 20 ఏళ్లు పండపెడ్తామ్, వర్మకూ వాతలు?

కాకినాడ జిల్లా పిఠాపురం(pithapuram)లోని చిత్రాడలో జరుగుతున్న జనసేన సభలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జగన్‌ మరో 20 ఏళ్ల పాటు కలలు కంటూనే ఉండాలని నాగబాబు చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులను తెప్పించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నాగబాబు చేసిన ప్రశంసలు, జగన్‌పై విమర్శలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.


నాయకులు మాట్లాడేటప్పుడు
పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ వార్షిక మహోత్సవం సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జగన్‌పై నేరుగా విమర్శలు గుప్పించారు. జగన్‌ను పెద్ద కమిడియన్‌గా అభివర్ణిస్తూ, ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. జగన్ కలలు కంటూనే ఉంటారని, ఇంకో 20 ఏళ్ల వరకు ఆయన కలలు కంటూనే ఉండాలని నాగబాబు వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అవుతుందో జగన్ ఓ ఉదాహరణ అంటూ నాగబాబు జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

Read Also: Amaravati Capital: చంద్రబాబు బిగ్ ప్లాన్..అమరావతి రాజధాని .


ప్రజలకు గర్వకారణం
పుష్కరాలు ఎంత పవిత్రమైనవో, ఈ సభ కూడా అంతే పవిత్రం. ఇక్కడ మాట్లాడిన ప్రతి మాటకు ప్రాముఖ్యత ఉంది. కాబట్టి, నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని నాగబాబు హితవు పలికారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్‌ను క్రమశిక్షణ గల నేతగా అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణమని నాగబాబు అన్నారు.

జన సైనికుడినని చెప్పుకునేందుకు..
పవన్‌కు రాజకీయ అనుభవం ఇప్పుడు మరింత పెరిగిందని. గత 12 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ, ఆయనలో ఆత్మస్థైర్యం తగ్గలేదని, అందుకే జనసేన 12వ వార్షిక మహోత్సవం ఓ విజయోత్సవంగా మారిందని నాగబాబు అన్నారు. ఈ సందర్భంగా తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు పవన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో జన సైనికుడినని చెప్పుకునేందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు.

వర్మకు కౌంటర్
పవన్ విజయానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు. వాటిలో ఒకటి పవన్ కాగా, రెండోది పిఠాపురం ప్రజలని పేర్కొన్నారు. ఇవి రెండే ప్రధానకారణాలని వెల్లడించారు. కానీ పవన్ విజయానికి తానే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని పరోక్షంగా నాగబాబు వర్మకు కౌంటర్ ఇచ్చారు.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×