BigTV English

Horror Movies OTT: మతిపోగొట్టే సీన్లతో హారర్ మూవీ.. వెన్నులో వణుకుపుట్టించే సీన్..

Horror Movies OTT: మతిపోగొట్టే సీన్లతో హారర్ మూవీ.. వెన్నులో వణుకుపుట్టించే సీన్..

Horror Movies OTT: కామెడీ చిత్రాలు కన్నా ఈమధ్య హారర్ సినిమాలే ఎక్కువగా వ్యూస్ ను రాబడుతున్నాయి.. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఓటిటిలో కూడా పలు ఆసక్తికర సినిమాలో రిలీజ్ అవుతుండడంతో జనాలు ఎక్కువగా ఓటిటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.. అదేవిధంగా పలు ఓటిటి సంస్థలు కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేలా కొత్త అలాగే పాత సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఓ హారర్ సినిమాను స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి..


మూవీ & ఓటీటీ..

ఈమధ్య మలయాళం సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. ఆ ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమా కూడా మంచి టాక్ ని అందుకుంటున్నాయి.. ఇక హారర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కూడా రేఖాచిత్రం, ఐడెంటిటీ వంటి ఎన్నో సినిమాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో సత్తా చాటాయి. మలయాళం సినిమాలను చూసేందుకు అన్ని ఇండస్ట్రీల ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. వారికి అభిరుచికి తగినట్లుగానే ఆ సినిమాలు కూడా ఉంటున్నాయి. ఇక ఓటీటీలో ఎక్కువగా అలరించే జోనర్స్‌లలో హారర్ థ్రిల్లర్స్ కూడా ఒకటి. ఈ జానర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన చురులి 2021 ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ విషయానికొస్తే..

ఈ సినిమా స్టోరీ మొత్తం అడవిలోనే జరుగుతుంది. అసలు ఏ సీను ఎక్కడ సింక్ అవుతుందో తెలియకుండానే ఈ సినిమా మొత్తం పూర్తవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆడియన్ బుర్ర పాడు చేస్తుందనే చెప్పాలి. కాకపోతే భయంకరమైన క్రైమ్ సన్నివేశాలు ఉండటంతో ఈ సినిమా హారర్ స్టోరీగా బాగానే పాపులారిటీని అందుకుంది. అటవీ గ్రామంలోని ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి పోలీసులు పడే తర్జనభజన ఈ సినిమాలో చూపిస్తారు. ఒక క్రిమినల్‌ను పట్టుకునేందుకు ఓ ఎస్సై, ఒక కానిస్టేబుల్ దట్టమైన అడవిలో ఉండే చురులి గ్రామానికి వెళ్తారు. అక్కడ మారు పేర్లతో ఓ హోటల్‌లో పనికి చేరుతారు. ఆ తర్వాత చురులి గ్రామంలో ఇద్దరు పోలీసులు ఎదుర్కొన్న అనుభవాలే మిగతా కథ.. ఈ సినిమా స్టోరీ మొత్తం సినిమా మొదలైన ఒక్క లైన్ లోనే తెలిసిపోతుంది కాకపోతే అనేక ట్విస్టులతో డైరెక్టర్ ఆడియన్ ని కట్టిపడేస్తాడు.. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటాయి. కానీ, అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా వరకు ఆడియెన్స్‌కు చురులి నచ్చకపోవచ్చు. కానీ, ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను చురులి ద్వారా చేయొచ్చు. భయంకరమైన హారర్ సన్నివేశాలను చూడాలనుకునే వారికి ఇదొక ప్రత్యేకమైన థ్రిల్ ను అందిస్తుంది. సినిమాలు ఇష్టపడే వాళ్ళు ప్రముఖ ఓటిటి సోనీ లైవ్ లో ఈ మూవీస్ రీమింగ్ అవుతుంది. థియేటర్లలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టడంతో పాటుగా హిట్ టాక్ ని అందుకుంది. ఓటిటిలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

ఈ మధ్య మలయాళ ఇండస్ట్రీలో వస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాయి అలాగే ఈ సినిమా కూడా ఒక చిన్న లైన్ తో స్టోరీ మొత్తం అల్లేస్తాడు డైరెక్టర్. కేవలం మలయాళం లో మాత్రమే కాదు ఇటీవలస్తున్న తమిళ కన్నడ చిత్రాలు కూడా ఇలాంటి స్టోరీలతోనే ఎక్కువగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి..

Tags

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×