BigTV English

Trains Speed: రైళ్లు రాత్రిపూట వేగంగా దూసుకెళ్తాయి, కారణం ఏంటో తెలుసా?

Trains Speed: రైళ్లు రాత్రిపూట వేగంగా దూసుకెళ్తాయి, కారణం ఏంటో తెలుసా?

Indian Trains: దేశ వ్యాప్తంగా నిత్యం వేలాది రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఆయా రైళ్లకు దారి ఇచ్చేందుకు కొన్ని రైళ్లలు మార్గ మధ్యంలో ఆగాల్సి ఉంటుంది. అర్జంట్ అవసరం ఉన్న ప్రయాణీకులకు చిరాకు కలిగిస్తుంది. కానీ, రాత్రి పూట రైళ్ల వేగంగా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని రైళ్లు గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. అయితే, పగటి పూటతో పోల్చితే రాత్రి వేళ్లలో వేగం ఎందుకు ఎక్కువగా ఉంటుంది? వేగానికి కారణం అయ్యే అంశాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ట్రాఫిక్ చాలా తక్కువ

పగటి పూట రైల్వే ట్రాక్స్ చాలా బిజీగా ఉంటాయి. ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు అధికరంగా రాకపోకలు కొనసాగిస్తాయి. రైల్వే గేట్ల దగ్గర వాహన రాకపోకలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైళ్లు నెమ్మదిగా వెళ్తాయి. పగటి పూట పలు రైళ్లకు దారి ఇవ్వడానికి కొన్ని రైళ్లను పక్కన నిలిపేస్తారు. అయితే, ఈ ఇబ్బందులు రాత్రి పూట ఉండవు. ఈ నేపథ్యంలో రైళ్లు ఎలాంటి అంతరాయం లేకుండా అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి.


హాల్టింగ్స్ చాలా తక్కువ

ఇక పగటిపూట ప్యాసింజర్ రైళ్లతో పోల్చితే గూడ్స్ రైళ్లు , సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఎక్కువగా స్టాప్ లు ఉంటాయి. అయితే, రాత్రిపూట ఈ రైళ్లకు తక్కువ స్టాప్ లు ఉంటాయి. ఈ నేపథ్యంలో వేగం స్థిరంగా వేగంగా ఉంటుంది. అంతరాయం లేకుండా రైళ్తు ప్రయాణిస్తాయి.

డ్రైవింగ్ మీదే ఎక్కువ ఫోకస్

రాత్రి పూట కాస్త విజుబులిటీ సమస్యలు ఉన్నప్పటికీ రైల్వే స్టేషన్లు, క్రాసింగ్స్ దగ్గర లోకో పైలెట్లు పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉండదు. పూర్తిగా డ్రైవింగ్ మీదే ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ లైటింగ్ సిస్టమ్, లేటెస్ట్ సిగ్నలింగ్ వ్యవస్థలు రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణించేందుకు కారణం అవుతాయి.

ఇక రైల్వే నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి రాత్రి పూట రైళ్ల షెడ్యూల్ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్ వేగవంతమైన ప్రయాణానికి కారణం అవుతుంది. ముఖ్యంగా పీక్ అవర్స్ లో సరుకు రవాణా రైళ్లకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో ప్యాసింజర్ రైళ్లకు ఇబ్బందులు ఉండవు.

Read Also: ఇకపై రైళ్లలో ఫుడ్ మెను, రేట్ల లిస్ట్ తప్పనిసరి.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!

 రైల్వే ట్రాక్ పనులు

ఇక సాధారణంగా రైళ్లకు సంబంధించిన మెయింటెనెన్స్ పనులుతో పాటు ఇతర మరమ్మతులను పగటిపూట నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రైళ్ల వేగానికి పరిమితులు విధిస్తారు. రాత్రి పూట ఎలాంటి పనులు చేయరు కాబట్టి రైళ్ల వేగానికి పరిమితులు ఉండవు. గరిష్ట వేగంతో ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. మొత్తంగా రైళ్లు పగటి పూటతో పోల్చితే రాత్రి పూట వేగంగా ప్రయాణిస్తాయి. ప్రయాణీకులు నిద్ర పోవడం వల్ల రైళ్ల వేగాన్ని పెద్దగా గుర్తించరు. రెగ్యులర్ గా రైలు ప్రయాణం చేసే వారికి ఈ విషయం బాగా తెలుస్తుంది.

Read Also: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది.. ప్రత్యేకతలు చూస్తే పరేషాన్ కావాల్సిందే!

Tags

Related News

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Big Stories

×