BigTV English

KA Paul comments on Jagan, Pawan: కేఏపాల్ కొత్త పలుకులు, జగన్, పవన్ ఇంకా షాక్‌లోనే

KA Paul comments on Jagan, Pawan: కేఏపాల్ కొత్త పలుకులు, జగన్, పవన్ ఇంకా షాక్‌లోనే

KA Paul comments on Jagan, Pawan(Andhra politics news): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. టీడీపీ సునామీకి కాకలు తీరిన వైసీపీ నేతలు సైతం మట్టి కరిచారు. ఎలా ఓడి పోయామన్నది ఇప్పటికీ ఆయా నేతలకు అంతుబట్టడం లేదు. దీనిపై ఇప్పుడిప్పుడు అంతర్మథనం చేసుకునే పనిలోపడ్డారు.


ఈ విషయంలో ప్రజాశాంతి చీఫ్ ఏకె పాల్ తొందరగానే తేరుకున్నారు. అంతేకాదు మీడియా ముందుకొచ్చి తాను చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారు. పోటీ చేసిన అన్ని సీట్లలో జనసేన పార్టీ గెలవడంతో పవన్ కల్యాణ్ షాక్‌లో ఉన్నారని తెలిపారు. ఏం మాట్లాడాలో ఆయనకు అర్థంకావడం లేదని తనదైనశైలిలో చెప్పుకొచ్చారు.

ఎన్నికల విషయంలో అందరి కంటే ఎక్కువగా షాక్‌కు గురైన వ్యక్తుల్లో సీఎం జగన్ ముందు ఉంటారన్నారు కేఏ పాల్. తనపై కేసులున్నాయన్న విషయమా? లేక సర్వేలు ప్రకారం సీట్లు రాలేదన్న షాక్‌ నుంచి ఆయన ఇంకా తేరుకున్నట్లు కనిపించలేదన్నారు. డీబీటీ ద్వారా కోట్ల రూపాయలు ప్రజలకు ట్రాన్స్‌ఫర్ చేసినా దారుణంగా ఓడిపోయామనే షాక్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.


ALSO READ: అయ్యన్న ఆగ్రహం.. ప్రతీకారం తప్పదు, జగన్‌కు ఆ శాపం…

విశాఖ లోక్‌‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు కేఏ పాల్. దాదాపు 9 లక్షల ఓట్లు కూటమి అభ్యర్థి ఎలా పడ్డాయని ఆశ్చర్యపోతున్నారని అన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తాను ముందే చెప్పానని వివరించారు కేఏ పాల్.

తనకు కేవలం నాలుగు ఓట్లు మాత్రమే పడ్డాయని, కొన్ని బూత్లలో ఒక్క ఓటు పడలేదన్నారు పాల్. మా ఇంట్లో ఉన్న 22 ఓట్లు ఏమయ్యాయో, ఎవరికి పడ్డాయో తెలియడం లేదన్నారు. మళ్ళీ రిపోలింగ్ జరపాలని మనసులోని మాట బయటపెట్టారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.

 

 

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×