E-Paper
Advertisement

కాలేజ్ విద్యార్థుల కోసం.. అత్యుత్తమ విండోస్ ల్యాప్‌టాప్స్.. ఫీచర్లు చూస్తే ఫిదానే!

కాలేజ్ విద్యార్థుల కోసం.. అత్యుత్తమ విండోస్ ల్యాప్‌టాప్స్.. ఫీచర్లు చూస్తే ఫిదానే!
Advertisement

Student Laptops 2026: ఒకప్పుడు ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన ల్యాప్ టాప్ లు ప్రస్తుతం విద్యార్థులకు సైతం తప్పనిసరిగా మారిపోయాయి. కాలేజీ ప్రాజెక్టులు, ఆన్ లైన్ క్లాసుల కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు వీటిని ఉపయోగిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా కాలేజీలో చేరే వారి కోసం అద్భుతమైన విండోస్ ల్యాప్ టాప్స్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ప్రత్యేకతలపై ఓ లుక్కేసి.. నచ్చిన దానిని కొనుగోలు చేసేందుకు ట్రై చేయండి.

ASUS Vivobook S14 OLED

రోజూ కాలేజీకి తీసుకెళ్లడానికి తేలిగ్గా ఉంటూ.. మంచి ఆల్ రౌండ్ ల్యాప్ టాప్ కోరుకుంటే దీనిని పరిశీలించవచ్చు. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్.. స్టడీస్ తో పాటు క్రియేటివ్ వర్క్స్ కు కూడా అద్భుతంగా పని చేస్తుంది. దీని OLED స్క్రీన్ పై స్పష్టంగా విజువల్స్ చూడొచ్చు.

ASUS Zenbook A14 OLED

Advertisement

స్టైలిష్ లుక్ తో పాటు.. ఎక్కువసేపు ఛార్జింగ్ రావాలని భావిస్తే ఈ ల్యాప్ టాప్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. స్నాప్‌డ్రాగన్ X సిరీస్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్.. అల్ట్రా-లైట్‌వెయిట్ డిజైన్‌ కలిగి ఉంది. ఇందులో కాలేజ్ ప్రాజెక్ట్‌లను మరింత వేగంగా, సులభంగా చేసేందుకు వీలు కలుగుతుంది.

HP OmniBook 5 OLED

ఈ ల్యాప్‌టాప్ సరికొత్త AI పవర్‌తో రీబ్రాండ్ అయింది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 2K ఒలెడ్ డిస్‌ప్లేతో వచ్చే ఈ మోడల్.. విద్యార్థులకు తక్కువ బడ్జెట్ లోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. రోజంతా కాలేజీలో గడిపే విద్యార్థులకు ఇది సరిగ్గా సరిపోతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. బ్యాటరీ బ్యాకప్ సైతం అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నాయి.

Advertisement

Also Read: స్టూడెంట్స్ స్పెషల్.. రూ.15 వేల బడ్జెట్లో.. అధునాతన స్మార్ట్ ఫోన్లు ఇవే!

Acer Nitro Lite 16, Lenovo LOQ

కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, గేమింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ రెండు ల్యాప్‌టాప్‌లు బెస్ట్ ఆప్షన్స్. ఇంటెల్ కోర్ i7/i5 ప్రాసెసర్లు, ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్‌లతో ఇవి రూపొందాయి. హెవీ సాఫ్ట్‌వేర్లను సైతం ఇవి ఎంతో స్మూత్ గా హ్యాండిల్ చేస్తాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి లెనోవో.. పెద్ద స్క్రీన్, మెరుగైన కూలింగ్ సిస్టమ్ కోరుకునే వారికి ఏసర్ నైట్రో లైట్ 16 బెస్ట్ ఆప్షన్స్ గా నిలవనున్నాయి.

Also Read: ఏసీ బాక్స్‌పై బకెట్ వాటర్‌.. నిజంగా కూలింగ్ పెరుగుతుందా? నిపుణులు చెప్పేది వింటే..!

Related News

అమ్మబాబోయ్.. మళ్లీ పెరగబోతున్న రీఛార్జ్ ధరలు.. ఏకంగా 15% టారిఫ్ హైక్!

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

Big Stories

Advertisement
×