E-Paper
Advertisement

అక్టోబర్ 1 నుంచి వాట్సప్‌ కొత్త రూల్.. ఒక్కో మెసేజ్‌కు 14 పైసలు ఛార్జీ.. సామాన్యులపై ప్రభావమెంత?

అక్టోబర్ 1 నుంచి వాట్సప్‌ కొత్త రూల్.. ఒక్కో మెసేజ్‌కు 14 పైసలు ఛార్జీ.. సామాన్యులపై ప్రభావమెంత?
Advertisement

WhatsApp Charges: ఈ రోజుల్లో వాట్సప్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ పౌరుల నుంచి వ్యాపార సంస్థల వరకూ సందేశాలు పంపుకునేందుకు ప్రధాన వేదికగా మారింది. అయితే అక్టోబర్ 1 నుంచి వాట్సప్ బిజినెస్ ఖాతాలకు సంబంధించి కొత్త రూల్ అమల్లోకి రాబోతోంది. కొన్ని రకాల సందేశాలకు కంపెనీల నుంచి ప్రతి మెసేజ్‌కు దాదాపు 14 పైసలు వసూలు చేయాలని వాట్సప్ నిర్ణయించింది.

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

ఇన్నాళ్లు కంపెనీ, వినియోగదారుడుకు మధ్య జరిగే సందేశాలకు వాట్సప్ ఎలాంటి ఛార్జీని వసూలు చేయలేదు. ఉచితంగానే వీటిని పంపే వెసులుబాటు కల్పించింది. కానీ అక్టోబర్ 1 నుంచి ఈ విధానం మారనుంది. 24 గంటల వ్యవధిలో పంపే యుటిలిటీ మెసేజ్‌‌లపై ఇక నుంచి చార్జీలు వర్తించనున్నాయి. అయితే యూజర్ సర్వీస్ సేవలకు సంబంధించి ప్రతి బిజినెస్ ఫోన్ నంబర్‌కు నెలకు అందించే మొదటి 1,000 సర్వీస్ మెసేజ్‌లు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని వాట్సప్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ పరిమితి దాటిన తర్వాత పంపే మెసేజ్‌లకే ఒక్కోదానికి 14 పైసల చొప్పున చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.

ఈ ఛార్జీలు ఎవరికి వర్తిస్తాయి?

Advertisement

అయితే ఈ నయా ఛార్జీల భారం సాధారణ ప్రజలపై ఎంతమాత్రం ఉండదని వాట్సప్ ఇప్పటికే స్పష్టం చేసింది. వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే ఈ-కామర్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్, పెద్ద తరహా స్టార్టప్‌లు మాత్రమే ఈ ఛార్జీలను మెటా సంస్థకు చెల్లిస్తాయి. వినియోగదారులకు పంపే ఆర్డర్ స్టేటస్, డెలివరీ అప్‌డేట్‌లు, వన్ టైమ్ పాస్‌వర్డ్‌లు (OTP) వంటి బిజినెస్ మెసేజ్‌‌లకు ఈ నిబంధన వర్తించనుంది. అయితే వినియోగదారులు మాత్రం.. వ్యాపార సంస్థలకు మెసేజ్ చేయడానికి, వారి నుంచి మెసేజ్‌లు పొందడానికి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

Also Read: పోస్టాఫీసు మోస్ట్ వాంటెడ్ స్కీమ్.. రూ.8000 కడితే చేతికి రూ.5.68 లక్షలు.. అస్సలు లైట్ తీసుకోవద్దు!

యుటిలిటీ మెసేజ్‌ల ధరల వివరాలు

Advertisement

భారత్‌లో డెలివరీ అయ్యే ప్రతీ యుటిలిటీ మెసేజ్‌కు మెటా సంస్థ ప్రాథమికంగా 11.5 పైసలు నిర్ణయించింది. దీనికి 18 శాతం జీఎస్టీ (GST) తోడవ్వడంతో వినియోగదారులకు పంపే ఒక్కో మెసేజ్ ధర దాదాపు 14 పైసలకు చేరింది. మరోవైపు ఆఫర్లు, డిస్కౌంట్లు, సేల్ ప్రకటనల వంటి మార్కెటింగ్ మెసేజ్‌ల ధర ఇప్పటికే ప్రతి మెసేజ్‌కు సుమారు 8 పైసలుగా ఉంది. అలాగే ఓటీపీలు పంపే ఆథెంటికేషన్ మెసేజ్‌లకు కూడా 11.5 పైసలతో పాటు జీఎస్టీ వర్తిస్తోంది.

Also Read: వయసు 21 ఏళ్లు.. ఒక్క నెలలో రూ.2.6 కోట్లు సంపాదన.. అదిరిపోయే బిజినెస్ ఐడియా?

Tags

Related News

Apple Pay వచ్చేసింది.. ఇక ఐఫోన్‌తో పేమెంట్స్ మరింత ఈజీ, ఎలా వాడాలో తెలుసా?

కరెంట్ పోల్స్‌పై నంబర్లు ఎందుకుంటాయో.. తెలిస్తే షాకవుతారు!

ఇంటినే థియేటర్‌లా మార్చేసే Lumio Aura 5 స్పీకర్ వచ్చేసింది.. ఫీచర్లు అదరహో!

జేబీఎల్ హెడ్‌ఫోన్స్ మస్ట్ బై డీల్స్..అమెజాన్ ఫెస్టివల్ సేల్ స్పెషల్

ఫోన్ ఇచ్చేముందు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు..ఎవరూ మీ పర్సనల్ గ్యాలరీ లేదా యాప్స్‌ని టచ్ కూడా చేయలేరు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో..ఊహించని ధరకే ఎయిర్ ఫ్రైయర్లు

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

Big Stories

Advertisement
×