Narasaraopet: ఏం జరిగిందో తెలీదు. ఓ యువకుడ్ని అత్యంత దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. యువకుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. సంచలనం రేపిన ఈ ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
పల్నాడు జిల్లా నరసరావుపేట టౌన్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌లో సోమవారం అర్ధరాత్రి ఓ యువకుడి హత్య జరిగింది. పెద్దచెరువు ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల రాజేష్ అవివాహితుడు. పెళ్లి కాకపోవడంతో వచ్చిన డబ్బులతో మద్యం తాగి ఎక్కడో ఒక చోట నిద్ర పోతుండేవాడు. సోమవారం రాత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌లో నిద్రపోతున్నాడు రాజేష్. గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు రాజేష్ తలపై రాయితో మోదారు.
ఆ తర్వాత స్పృహ కోల్పోవడంతో కత్తెరతో అతడి ప్రైవేటు పార్ట్స్ కోసి అత్యంత పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత ఆ యువకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు పోలీసులు. మృతుడు రాజేష్ రాత్రి 10 గంటల వరకు కాంప్లెక్స్ ఆవరణలో ఉన్నట్లు తేలింది. ఈ లెక్కన రాజేష్ కదలికలను అర్ధరాత్రి వరకు గమనించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు.
ALSO READ: ఏపీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం జోష్.. రాష్ట్ర అభివృద్ధికి రూ.11,085 కోట్ల ప్యాకేజీ!
ఈ ఘటన అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య జరిగినట్టు తేల్చారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏమోచ్చింది? కక్షలు లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. నార్మల్‌గా పల్నాడు జిల్లా పేరు చెప్పగానే చాలామంది వణికిపోతారు. ఎవర్నైనా ఏమన్నా, పగలు సైలెంట్‌గా రాత్రి వేళ లేపేస్తారని ఆ ప్రాంతంలో ఉన్నవారు సందర్భాన్ని బట్టి చెబుతుంటారు. కానీ యువకుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసి చంపాల్సిన అవసరం ఏంటన్నది పోలీసుల విచారణలో తేలనుంది.