E-Paper
Advertisement

ఏపీలో ప్రజలకు బిగ్ రిలీఫ్.. కేజీ ఉల్లి కేవలం రూ.35, వాటిలో ఏది ఉన్నా సరిపోతుంది

ఏపీలో ప్రజలకు బిగ్ రిలీఫ్.. కేజీ ఉల్లి కేవలం రూ.35, వాటిలో ఏది ఉన్నా సరిపోతుంది
Advertisement

AP Rythu Bazars: సామాన్యులకు ఊరట ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. పెరిగిన ఉల్లి ధరను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం, సబ్సిడీ ధరకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. బుధవారం నుంచి రైతు బజార్లలో కిలో ఉల్లి కేవలం రూ. 35కే విక్రయించడం మొదలుపెట్టింది. తొలి దశ విజయవాడ సిటీలో విక్రయాలను అమలు చేసింది.

ఏపీలో ప్రజలకు బిగ్ రిలీఫ్

సరైన సమయంలో వర్షాలు లేకపోవడంతో మార్కెట్‌లో ఉల్లిపాయల దిగుబడి తగ్గిపోయింది. దీంతో హోల్‌సేల్ మార్కెట్లో ధర ఆకాశాన్ని తాకింది. కిలో రూ.80 నుంచి రూ.60 వరకు నడుస్తోంది. పరిస్థితి గమనించిన ఏపీ ప్రభుత్వం, రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై ఉల్లిని విక్రయించాలని డిసైడ్ అయ్యింది. తొలి విడత విజయవాడలోని అన్ని రైతు బజార్లలో సబ్సిడీ ధరకు ఉల్లిపాయలు అందిస్తోంది. అయితే ప్రజలు ఆధార్ కార్డు లేకుంటే రేషన్ కార్డు చూపించాల్సి వుంటుంది.

సబ్సిడీలో కేజీ ఉల్లి కేవలం రూ.35

Advertisement

ప్రతి కుటుంబం నెలకు రెండు కేజీలు ఉల్లిపాయలు కొనుగోలు చేయవచ్చు. సబ్సిడీ కింద ఇస్తున్న ఉల్లి కేజీ రూ. 35 మాత్రమే. డిమాండ్‌ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లకు విస్తరించనుంది.  ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు-పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం వెల్లడించారు.

ఆధార్ లేకుంటే రేషన్ కార్డు, ఏది చూపించినా

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఆర్థిక భారం నుండి సామాన్యులను కాపాడటానికి మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో రాయితీపై ఉల్లిపాయల అమ్మకం మొదలుపెట్టినట్టు తెలిపారు. త్వరలో నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తీసురానుంది. బియ్యం ఉత్పత్తి తగ్గడం, ఆపై ధరలు పెరగడంతో బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్లలో రూ.52 నుంచి 50 లకు పంపిణీ చేయనుంది.

Advertisement

ALSO READ: కత్తితో యువకుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసి.. ఆ తర్వాత ఏం చేశారంటే, నరసారావుపేటలో ఘోరం

ఇదిలాఉండగా మీ మార్టులు షాపుల్ని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని డిసైడ్ అయ్యింది ఏపీ ప్రభుత్వం. 870 మీ మార్ట్ షాపులు సిద్ధంగా ఉండగా, వాటి ద్వారా తక్కువ ధరలకు 64 రకాల నిత్యావసర వస్తువులు అమ్మకాలు చేపట్టనుంది. 100, 250, 500 గ్రాముల ప్యాకెట్లలో సరుకులు అందుబాటులో ఉంటాయి. కందిపప్పు, పామాయిల్ కూడా సబ్సిడీ ధరపై ప్రజలకు అందిస్తామని గతంలో మంత్రి నాదెండ్ల తెలిపారు.

Related News

మల్లం బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం.. వేడి సాంబారు పడి 12 మందికి గాయాలు

మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి.. ఏకంగా టీచర్‌ వ్యవహారం, రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు

కత్తితో యువకుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసి.. ఆ తర్వాత ఏం చేశారంటే, నరసారావుపేటలో ఘోరం

ఏపీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం జోష్.. రాష్ట్ర అభివృద్ధికి రూ.11,085 కోట్ల ప్యాకేజీ!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఘోర ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణమా?

ఏకగ్రీవాల కోసం కూటమి సర్కార్ భారీ కుట్ర.. మాజీ మంత్రి బుగ్గన సంచలనం!

రన్నింగ్ కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం!

Big Stories

Advertisement
×