Steel Plant: ఏపీలోని విశాఖలో స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. SMS 1లో ల్యాడిల్ నుంచి ద్రవపు ఉక్కు కింద పడిపోయింది. దీంతో గతంలో కూడా ఇదే విభాగంలో ప్రమాదం జరిగినట్టు సమారం. అయితే ఈ ప్రమాదంలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అక్కడి అధికారుల కార్మికులు తెలిపారు.
అయితే చాలా రోజుల తరువాత నేడు కంపెనీలో ప్రత్యేక పూజలు చేసి ఈరోజు సీడీసీని ప్రారంభించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ప్రారంభించిన రోజే ప్రమాదం జరగడంతో అక్కడి అధికారలంతా విస్మయానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో అధికారులంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే గతంలో సేమ్ ఇదే ప్రాంతంలో ఎస్‌ఎంఎస్-1 తీవ్ర ప్రమాదం చోటుచుసుకుంది.
Also read: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!
ఈ ప్రమాదంలో అప్పుడు కొంత మంది కార్మికులు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. దీంతో ఆ సంఘటన తరువాత చాలా రోజుల తరువాత పనులు ఆపివేసి మల్లీ మరమత్తులు చేసి నేడు తిరిగి ప్రారంభించారు. దీంతో నేడు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి సీడీసీ ప్రాసెస్ పనులను తిరిగి ప్రారంభించారు. అయితే ప్రారంభించిన రోజే మళ్లీ ద్రవపు ఉక్కు పదార్థం బైటికి రావడంతో అధికారులు షాకయ్యారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారుల విచారన చేస్తున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
విశాఖ ఉక్కు కర్మాగారంలో మరో ప్రమాదం
విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్‌ఎంఎస్-1 సీసీడీ విభాగంలో ఉక్కు ద్రవం తీసుకువెళ్తున్న లాడిల్ స్లైడ్ గేట్ మూతపడక ద్రవం నేలపాలైంది. రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. #VisakhapatnamSteelPlant… pic.twitter.com/fZWY2NDs9A
— BIG TV Breaking News (@bigtvtelugu) September 29, 2026