E-Paper
Advertisement

ఇంటినే థియేటర్‌లా మార్చేసే Lumio Aura 5 స్పీకర్ వచ్చేసింది.. ఫీచర్లు అదరహో!

ఇంటినే థియేటర్‌లా మార్చేసే Lumio Aura 5 స్పీకర్ వచ్చేసింది.. ఫీచర్లు అదరహో!
Advertisement

Lumio Aura 5: మంచి మ్యూజిక్ వినాలన్నా, ఇష్టమైన సినిమా చూస్తూ థియేటర్ ఫీలింగ్ రావాలన్నా సరైన సౌండ్ సిస్టమ్ ఉండాల్సిందే. అందుకే ల్యూమియో కంపెనీ కొత్తగా ‘ఆరా 5’ అనే యాక్టివ్ బుక్‌‌షెల్ఫ్ స్పీకర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. రోజూ చూసే టీవీ సౌండ్ నచ్చక, కాస్త పవర్‌ఫుల్ ఆడియో సిస్టమ్ కోసం చూసే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. డిజైన్ కాంపాక్ట్‌గా ఉన్నప్పటికీ.. దీని నుంచి వచ్చే సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది.

ధర, ఆఫర్ వివరాలు:

ఈ ల్యూమియో ఆరా 5 అసలు ధర రూ.24,999గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ కింద రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా వాడితే ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. అక్టోబర్ 15 నుంచి అమెజాన్‌లో సేల్ ప్రారంభమవుతుంది. త్వరలో రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కూడా మంచి డీల్స్‌తో ఇవి అందుబాటులో ఉంటాయి.

పవర్‌ఫుల్ సౌండ్ క్వాలిటీ:

Advertisement

ఈ స్పీకర్ సిస్టమ్‌‌లో రెండు 4.5 అంగుళాల అల్యూమినియం వూఫర్లు, రెండు 1 అంగుళం సిల్క్ డోమ్ ట్వీటర్లు ఇచ్చారు. ఇవి 200W పిక్ అవుట్‌పుట్, 100W కంటిన్యూయస్ అవుట్‌పుట్‌ను ఇస్తాయి. పాటల్లోని ప్రతి ఇన్స్ట్రుమెంట్ క్లియర్‌గా వినపడటమే కాకుండా.. మంచి బేస్ కూడా లభిస్తుంది. టీవీ సీరియల్స్, సినిమాలు, హెవీ మ్యూజిక్.. దేనికైనా ఇది చక్కగా సరిపోతుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

ప్రత్యేక సౌండ్ మోడ్స్:

Advertisement

ప్రజల రకరకాల ఇష్టాలకు తగ్గట్టుగా ఇందులో స్టూడియో, సినిమా, గ్రూవ్ అనే మూడు రకాల సౌండ్ మోడ్స్ ఇచ్చారు. మనం చూసే కంటెంట్‌ను బట్టి వీటిని మార్చుకోవచ్చు. టీవీ సినిమాలు చూసేటప్పుడు సినిమా మోడ్ పెడితే థియేటర్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే ఫోన్, ట్యాబ్ నుంచి పాటలు వినడానికి లేటెస్ట్ బ్లూటూత్ 5.4 వర్షన్ ఇచ్చారు. వైర్డ్ కనెక్షన్ల కోసం హెచ్‌డీఎమ్‌ఐ ఏఆర్‌సీ, యూఎస్‌బీ, ఆప్టికల్ పోర్టులు ఉన్నాయి.

వారంటీ, కంట్రోల్స్:

ఈ స్పీకర్లతో పాటు మినియాన్ ఓఎల్ఈడీ బ్లూటూత్ రిమోట్ వస్తుంది. దీని ద్వారా దూరంగా కూర్చునే సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. త్వరలోనే ప్రత్యేక మొబైల్ యాప్ కూడా రానుంది. కంపెనీ ఈ స్పీకర్లపై ఒక సంవత్సరం, రిమోట్‌పై ఆరు నెలల వారంటీ ఇస్తోంది. ఏమైనా సమస్య వస్తే హోమ్ సర్వీస్ సదుపాయం కూడా ఉంది. మంచి ఆడియో సిస్టమ్ కోరుకునేవారికి ఇది సరైన ఛాయిస్.

Also Read: పర్సులో ఈ వస్తువులు పెట్టుకుంటే డబ్బు నిలవదంటారు.. నిజమేనా?

Tags

Related News

కరెంట్ పోల్స్‌పై నంబర్లు ఎందుకుంటాయో.. తెలిస్తే షాకవుతారు!

అక్టోబర్ 1 నుంచి వాట్సప్‌ కొత్త రూల్.. ఒక్కో మెసేజ్‌కు 14 పైసలు ఛార్జీ.. సామాన్యులపై ప్రభావమెంత?

జేబీఎల్ హెడ్‌ఫోన్స్ మస్ట్ బై డీల్స్..అమెజాన్ ఫెస్టివల్ సేల్ స్పెషల్

ఫోన్ ఇచ్చేముందు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు..ఎవరూ మీ పర్సనల్ గ్యాలరీ లేదా యాప్స్‌ని టచ్ కూడా చేయలేరు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో..ఊహించని ధరకే ఎయిర్ ఫ్రైయర్లు

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

Big Stories

Advertisement
×