Kakinada Port Case: కాకినాడ సెజ్ వ్యవహారం వైసీపీ నేతలను వెంటాడుతోంది. దీనిపై ఈడీ రంగంలోకి దిగేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఈడీ ముందు హాజరయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై ఆయన్ని అధికారులు ఎంత సేపు విచారణ చేస్తారో చూడాలి.
కాకినాడ సీపోర్టు, సెజ్‌కు సంబంధించి షేర్ల బదలాయింపు వ్యవహారం దర్యాప్తు స్పీడందుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీ రావు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీలో కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
జగన్ ప్రభుత్వం హయాంలో వైసీపీకి చెందిన కొందరు నేతలు కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌లోని మేజర్ వాటాను బలవంతంగా తీసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. రూ.2,500 కోట్ల విలువ చేసే 41 శాతం షేర్లను కేవలం రూ.494 కోట్లకు బలవంతంగా తీసుకున్నారని ప్రధాన పాయింట్. పోర్టుకు పక్కనేవున్న సెజ్‌లో రూ.1100 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.12 కోట్లు తీసుకున్నారు.
దీనిపై ఓ వైపు సీఐడీ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈడీ కూడా లావాదేవీలపై ఆరా తీసింది. ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించింది ఈడీ. ఈ క్రమంలో కేసు నమోదు చేయడం, కీలకంగా వ్యవహరించిన వారికి నోటీసులు ఇచ్చింది. ఫలానా తేదీన విచారణకు హాజరుకావాలని అందులో ప్రస్తావించింది. తమ పనుల నిమిత్తం విచారణకు రాలేవని తొలుత అందరూ ఈడీకి రిప్లై ఇచ్చారు. ఇవాళ వీఎస్ఆర్ ఈడీ ముందుకొచ్చారు. ఆ తర్వాత మిగిలిన వారంతా రావచ్చన్నది ఈడీ అంచనా.
ALSO READ: ఆ డీల్ వెనుక వైసీపీ నేత? శ్రీకాంత్‌ను చంపేస్తామంటున్న వ్యక్తులు వాళ్లేనా?