BigTV English
Advertisement

Anitha Chowdary : హీరో శ్రీకాంత్ – అనితా చౌదరికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Anitha Chowdary : హీరో శ్రీకాంత్ – అనితా చౌదరికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Anitha Chowdary : ఇండస్ట్రీలోని కొందరు నటీనటుల మధ్య బంధుత్వం ఉంటుంది. అయితే వాళ్ళ రిలేషన్ గురించి బయట తెలియదు. ఇలా చాలామందే ఉన్నారు. కొందరు సెలెబ్రేటీలు సందర్బం వచ్చినప్పుడు బయట పడతారు. మరికొందరు సీక్రెట్ గానే కొనసాగిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనే డౌట్ రావడం కామన్.. అందుకు ఒక కారణం కూడా ఉంది. హీరో శ్రీకాంత్ రిలేటివ్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ గురించి అందరికి తెలుసు. కానీ శ్రీకాంత్ తో ఉన్న సంబంధం గురించి చాలా మందికి తెలియదు.. అనితా చౌదరి పేరు అందరికి తెలుసు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.. ఆమెకు శ్రీకాంత్ కు మధ్య గల సంబంధం ఏంటో తెలుసుకుందాం..


ఇండస్ట్రీలో అదృష్టం ఉంటే చిన్న సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది.. అందం, టాలెంట్ ఉన్న కొందరికి ఇండస్ట్రిలో పేరు ఉండదు. అందులో తెలుగు నటి అనితా చౌదరి కూడా ఒకరు.. ఈమె అటు బుల్లితెర, ఇటు వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించినా, తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయింది. ఈమె అతి చిన్న వయసులోనే 16 సంవత్సరాలకే తన కెరీర్ ని మొదలు పెట్టిన అనితా చౌదరి దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో యాంకర్ గా చేస్తూ బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంది.. ఇక ఆ తర్వాత వెండితెరపై సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. సంతోషం, మురారి , ఉయ్యాలా జంపాలా వంటి మరి కొన్ని సినిమాలలో నటించింది అనిత. ఇలా బుల్లితెరపై, వెండితెర పై తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె నటించిన సినిమాలు హిట్ అయ్యాయి. కానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు..

ఇక శ్రీకాంత్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తాళి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే యాంకరింగ్ మీద మక్కువతో ఆ సినిమా ఛాన్స్ వదులుకుంది అనితా. అనంతరం వెంకటేష్ హీరోగా తెరకెక్కిన రాజా సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఈమె ఒక్కో సినిమాతో తన నటనా ప్రతిభను చూపిస్తూ ప్రేక్షకులకు మెప్పించింది. లాక్ డౌన్ సమయంలో ఆక్వా అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.. ఇక శ్రీకాంత్ కు కజిన్ అవుతుంది. కృష్ణ చైతన్యను 2005 జూన్ 18న ప్రేమ వివాహం చేసుకున్నారు అనితా. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ లో ఛానల్ మెయింటెయిన్ చేస్తున్నారు. మంచి సందేశాన్ని ఇచ్చే వీడియోలు చేస్తుంటారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె ఎలాంటి పాత్రలో అయిన నటిస్తానని చెప్పింది. మరి అనితా టాలెంట్ ను గుర్తించి మంచి సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి..


ఇక శ్రీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తున్నాడు.. గేమ్ ఛేంజర్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికి ఆ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×