BigTV English

AP Political News: కాపుల కాక.. పవన్‌ను పద్మనాభంతో కార్నర్ చేస్తున్నారా?

AP Political News: కాపుల కాక.. పవన్‌ను పద్మనాభంతో కార్నర్ చేస్తున్నారా?
Advertisement
pawan kalyan mudragada

Mudragada vs Pawan kalyan(Political news today): ఉభయ గోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గంలో లేఖలు కాకరేపుతున్నాయి. ముద్రగడ రాసిన లేఖ.. ఆ సామాజిక వర్గాన్ని రెండుగా చీల్చుతున్నాయి. కొందరు నేతలు ముద్రగడను సమర్థిస్తుండగా.. మరికొందరు పవన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. హరిరామ జోగయ్య కామెంట్లతో కాపుల కలకలం మరింత చెలరేగింది.


వారాహి యాత్రలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై జనసేనాని చేసిన ఘాటు విమర్శలకు కాపు ఉద్యమ నేతల ముద్రగడ పద్మనాభం బాగా హర్ట్ అయ్యారు. పవన్‌కు కౌంటర్లు వేస్తూ పెద్ద లేఖ రాశారు. పవన్‌కు అంత సీన్‌ ఉంటే.. ద్వారంపూడిపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.

వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంత వరకు కరెక్టో చెప్పాలని ప్రశ్నించారు. తొక్క తీస్తా, నార తీస్తా, చెప్పుతో కొడుతా, గుండు గీయిస్తా అంటున్నారని.. ఎంతమందికి గుండ్లు గీయించారో, ఎంత మందిని చెప్పుతో కొట్టారో చెప్పాలన్నారు. కాపు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబం ఎంతో సహాయం చేసిందన్నారు. 175 స్థానాల్లో పోటీ చేస్తేనే సీఎంను చేయాలని అడగాలని.. కానీ పవన్ ఉమ్మడిగా పోటీ చేస్తానని చెబుతున్నారని.. అలాంటప్పుడు సీఎంగా చేయాలని ఎలా అడుగుతున్నారని లేఖలో ప్రశ్నించారు ముద్రగడ పద్మనాభం.


అటు, కాపు సామాజికవర్గ నేత హరిరామ జోగయ్య ముద్రగడపై తీవ్రంగా స్పందించారు. ఇంతకాలం ముద్రగడపై తనకున్న సదభిప్రాయం పోయిందని.. పదవుల కోసం కాపు సామాజిక వర్గాన్ని జగన్‌కు తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముద్రగడ ఉద్యమాన్ని నడిపారనే విషయం అర్థమైందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి ముద్రగడ మద్దతునివ్వడం సిగ్గుచేటన్నారు హరిరామ జోగయ్య.

టీడీపీ నేత బుద్దా వెంకన్న సైతం ముద్రగడకు కౌంటర్ లేఖ రిలీజ్ చేశారు. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్లపై ఉద్యమాలు చేసిన ముద్రగడ.. జగన్ హయాంలో ఎందుకు చేయలేడం లేదని ప్రశ్నించారు. ఇకపై ముద్రగడ రాసే ప్రతి లేఖకు బదులిస్తామని.. ఎదుటి వారిని ప్రశ్నించే ముందు జగన్ కాపులకు ఏం చేశారో వివరించి.. ఆ తర్వాత ప్రశ్నించాలన్నారు బుద్ధా వెంకన్న.

ముద్రగడ లేఖపై పవన్‌ ఎలా స్పందిస్తారు? ముద్రగడ వర్సెస్‌ పవన్‌గా పొలిటికల్ సీన్‌ మారితే.. ఎవరికి మేలు జరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో బలమైన సామాజిక వర్గాల్లో కాపు వర్గం ఒకటి. ఇన్నాళ్లు తన సామాజిక వర్గ ఓట్లు తనకే పడతాయని గట్టిగా నమ్మకంతో ఉన్నారు పవన్‌. కానీ సీన్‌లోకి ముద్రగడ వస్తే ఎలా ఉంటుంది? అధికార వైసీపీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయ్‌. పవన్‌కు ప్రత్యామ్నయంగా.. ముద్రగడను వైసీపీ రంగంలోకి దించుతుందా? అనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయ్.

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగైదు రోజులు భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

Tiruvuru Row: తిరువూరు వ్యవహారంపై సీఎం సీరియస్.. చంద్రబాబే స్వయంగా రంగంలోకి.. వేటు తప్పదా?

Ys Jagan: గవర్నర్ వద్దకు జగన్.. ఎందుకంటే?

Bhumana Karunakar Reddy: టీటీడీలో ఉన్నవాళ్లంతా నా మనుషులే.. కాన్ఫిడెన్షియల్ సమాచారం నా చేతికి: భూమన సంచలన వ్యాఖ్యలు

Kolikapudi Vs Kesineni Chinni: తిరువూరులో పొలిటికల్ హీట్.. కొలికపూడి వర్సెస్ కేశినేని చిన్ని.. అప్పుడు దైవం ఇప్పుడు దెయ్యమా?

Jagan Vs RRR: ఇంట్లో కూర్చుని మాట్లాడితే కుదరదు.. ఏదైనా ఉంటే అసెంబ్లీలో చూసుకో

AP Govt: ఏపీలో క్లస్టర్ విధానం రద్దు.. నవంబర్ 1 నుంచి డీడీఓ కార్యాలయాలు: డిప్యూటీ సీఎం పవన్

Google AI Data Centre: ఆ ఘనత మాదే.. వైజాగ్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ పై జగన్ యూ టర్న్

Big Stories

×