BigTV English
Advertisement

Kesineni Nani: లగడపాటి దారిలో కేశినేని నాని, కాకపోతే చిన్న ట్విస్ట్

Kesineni Nani: లగడపాటి దారిలో కేశినేని నాని, కాకపోతే చిన్న ట్విస్ట్

Kesineni Nani: బెజవాడలో రాజకీయ నేతలు ఓడిపోతే రాజకీయాలకు దూరమైనట్టేనా? కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి దారిలోనే కేశినేని నాని నడుస్తున్నారా? కేశినేని నాని కామెంట్స్ వెనుక అసలేం జరుగుతోంది? నాని చూపంతా కమలంపై పడిందా? పదవి లేకపోయినా.. ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎందుకన్నారు? ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో సాగుతోంది.


విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్‌లో తిరువూరు, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు ఓ టాక్ నడుస్తోంది. తాను బరిలోకి దిగుతానని సన్నిహితుల వద్ద ఆయన చెప్పినట్టు ఓ ఫీలర్ బెడవాడ పొలిటికల్ సర్కిల్స్ లో హంగామా చేస్తోంది. ఆయన ఏ పార్టీ వైపు వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు కేశినేని నాని. కొద్దిరోజుల తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కొత్త పార్టీ కంటే పాత పార్టీలే బెటరని భావించారు. ఆ తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2014, 19 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. తన జిల్లాకు చెయాల్సిన పనులు చేపట్టారు.  కాకపోతే రెండుసార్లు ఎంపీగా గెలవడంతో తనకు తిరుగులేదని భావించారు. ఆ తర్వాత పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించారు.   గత ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన, తన తమ్ముడు శివనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆనాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


లేటెస్ట్‌గా ఆదివారం నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, కాకపోతే ప్రజా సేవ మాత్రం వీడలేదన్నది ఆయన మాట. పదవిలో లేకపోయినా ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉంటానని తన మనసులోని మాట బయపెట్టారు. గడిచిన పదేళ్లు ఎవరి దగ్గర కప్పు టీ కూడా తాగకుండా పని చేశానని తన గురించి కాసింత మంచి మాటలు చెప్పుకొచ్చారు.

ALSO READ: రాష్ట్రంలో తొలి GBS మరణం – ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుల్ని కలవండి

ప్రస్తుతం కేశినేని నాని చూపు బీజేపీపై పడింది. ఎంపీగా ఉన్న పదేళ్ల కాలంలో బీజేపీ నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను ఉపయోగించుకుని కాషాయం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు నాని అనుచరుల మాట. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో ఆయన ఇప్పటికే మంతనాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై పార్టీ హైకమాండ్ తో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

కూతురు శ్వేతకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం ఆయన బీజేపీని ఎంచుకున్నట్లు వార్తలు లేకపోలేదు. కేశినేని నాని చేరికను టీడీపీ అంగీకరిస్తుందా? అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఒకవేళ కేశినేని నాని బీజేపీ తీర్థం పుచ్చుకుంటే విజయవాడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలున్నాయి.

ఒక్కసారి విజయవాడ ఎంపీ నియోజకవర్గం విషయానికొస్తే.. విజయవాడలో కంటిన్యూగా రెండుసార్లు ఎంపీగా గెలిచినవారు ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. గతంలో ఉపేంద్ర రెండుసార్లు (1996, 1998) కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా అంతే. 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు మాజీ ఎంపీ కేశినేని నాని వంతైంది. ఆయన కూడా 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ క్రమంలో కేశినేని కూడా రాజకీయాలకు దూరమయ్యారు.

 

Related News

Karthika Vanabhojanam: ఐదేళ్ల విరామం తర్వాత.. తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజన మహోత్సవం

CM Progress Report: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Big Stories

×