BigTV English

Kodali: చిరంజీవిని పకోడి అనలే.. నిరూపించాలంటూ నాని సవాల్..

Kodali: చిరంజీవిని పకోడి అనలే.. నిరూపించాలంటూ నాని సవాల్..

Kodali: చిరంజీవి జన్మదినం సందర్భంగా టీడీపీ, జనసేనలపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. కృష్ణా జిల్లా గుడివాడలో పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి మెగాస్టార్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన.. కేక్‌ కట్‌ చేసి చిరుకి విషెస్‌ తెలిపారు. చిరంజీవిని తాను విమర్శించలేదన్నారు. తాను శ్రీరామా అన్న ప్రతిక్షాలకు బూతులుగా వినిపిస్తున్నాయంటూ మండిపడ్డారు. కావాలనే చిరుకి తనకు మధ్య అగాధం సృష్టించాలనే కుట్రతో తన వ్యాఖ్యలకు వేరే అర్థాలు తీస్తున్నారన్న ఆయన.. విమర్శలు చేసినట్టు నిరూపించాలని సవాల్‌ విసిరారు. తమకు ఇచ్చినట్లే.. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పాను తప్పా.. వేరే ఉద్దేశంతో తాను మాట్లాడలేదన్నారు కొడాలి నాని.


ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్‌ చిరంజీవి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో హీరోల రెమ్యునరేషన్‌ బిల్లుపై ప్రస్తావిస్తూ బ్రో మూవీ ఈవెంట్‌లో చిరంజీవి జగన్‌ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు కౌంటర్‌ ఇవ్వడంతో ఏపీ రాజకీయాల్లో రగడ రాజుకుంది.

చిరంజీవిపై విమర్శలు తగవంటూ మెగా అభిమానులు రోడ్డెక్కారు. తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కృష్ణాజిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డౌన్ డౌన్ కొడాలి నాని.. జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అయితే, తాజాగా అదే నేత తాను చిరంజీవిని విమర్శించలేదంటున్నారు. అలా మాట్లాడి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు నాని.


అయితే.. కొడాలి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పకోడీలు అంటూ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన ఆయన.. తిరిగి తగ్గడంలో కారణం ఏమై ఉండొచ్చా అనే ఆలోచనలో పడ్డారు. వైసీపీ అధిష్టానం హెచ్చరించి ఉంటుందా? చిరుతో పెట్టుకుంటే వచ్చే ఎన్నికలపై ఎఫెక్ట్‌ పడుతుందనుకున్నారా? అన్న గుసగుసుల వినిపిస్తున్నాయి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×