BigTV English

Kodali Nani on Chiranjeevi: మెగా ఫ్యామిలీ Vs వైసీపీ.. చిరంజీవికి కొడాలి కౌంటర్..

Kodali Nani on Chiranjeevi: మెగా ఫ్యామిలీ Vs వైసీపీ.. చిరంజీవికి కొడాలి కౌంటర్..
Kodali Nani comments on Chiranjeevi

Kodali Nani comments on Chiranjeevi(Political news in AP):

బ్రో సినిమా వివాదం మెగా ఫ్యాన్ ఫ్యామిలీ Vs వైసీపీ సర్కార్ గా మారుతోంది. తాజాగా ప్రభుత్వ వైఖరిని టార్గెట్ చేస్తూ మెగా స్టార్ చిరంజీవి విమర్శలు చేయడంతో వివాదం మరింత రాజుకుంది. చిరు కామెంట్స్ పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పెద్దలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడి గాళ్లకి కూడా చెబితే బాగుంటుందంటూ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలు ఎందుకు? డ్యాన్సులు, ఫైట్స్ , యాక్షన్ గురించి మనం చూసుకుందాం అని చెప్పొచ్చు కదా అని అన్నారు.


వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా, రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని రాజకీయ నేతలకు సూచించారు. పేదల కడుపునింపే దిశగా ఆలోచించాలన్నారు. అలా చేస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారని చెప్పుకొచ్చారు. కానీ పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడతారేంటని చురకలు అంటించారు.

ఇటీవల బ్రో సినిమాపై వివాదం రేగిన వివాదం నేపథ్యంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఇన్నాళ్లు చిరంజీవి- ఏపీ సీఎం వైఎస్ జగన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. సినిమా టికెట్ల వివాదం సమయంలో కూడా మెగాస్టార్‌.. జగన్‌తో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ బ్రో సినిమా వివాదం నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్‌ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. ఈ ఇష్యూలోకి మెగా ఫ్యాన్స్ , జనసైనికులు ఎంటర్ అవుతారు. దీంతో పొలిటికల్ రచ్చ మరింత పెరగడం ఖాయం.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×