BigTV English

Kodi kathi Srinu Mother : కోడికత్తితో దాడి కేసు.. నిందితుడు శ్రీను తల్లి పాదయాత్ర..

Kodi kathi Srinu Mother : కోడికత్తితో దాడి కేసు.. నిందితుడు శ్రీను తల్లి పాదయాత్ర..

Kodi kathi Srinu Mother : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి జరిగింది. 2019 ఎన్నికలకు దాదాపు 6 నెలల ముందు ఈ ఘటన జరిగింది. ఈ కేసులో నిందితుడు శ్రీను అప్పటి నుంచి జైలులో ఉన్నాడు. 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడైన శ్రీను 5 ఏళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడు. కోర్టుకు వచ్చి సీఎం జగన్ సాక్ష్యం చెబితే తన కొడుకు బయటకు వస్తాడని నిందితుడు తల్లి ఎన్నోసార్లు వేడుకున్నారు. కానీ జగన్ మాత్రం కోర్టు మెట్లు ఎక్కడం లేదు. దీంతో నిందితుడు శ్రీను విశాఖ జైలులోనే ఉన్నాడు.


ఏపీ సీఎం జగన్ పై నిందితుడు శ్రీను కుటుంబ సభ్యులు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ప్రజల మద్దతు కోసం.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని శ్రీను తల్లి సావిత్రమ్మ నిర్ణయించుకున్నారు. తన కొడుకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే వారికి దళిత, ప్రజాసంఘాలు మద్దతు ఇస్తున్నాయి. వారి మద్దతుతోనే శ్రీను కుటుంబ సభ్యులు నిరసన దీక్ష కూడా చేపట్టారు. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి కానీ జగన్ నుంచి స్పందన రాలేదు.

ఇక అంతిమ పోరాటానికి శ్రీనుతోపాటు కుటుంబ సిద్ధమైంది. ఫిబ్రవరి 2 నుంచి ఏపీ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీను తల్లి శ్రీకారం చుట్టనున్నారు. కోనసీమ జిల్లా ఠాణేలంకలో యాత్ర ప్రారంభించనున్న సావిత్రమ్మ . తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిగడపకూ వివరిస్తామని ఆమె చెబుతున్నారు.జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అంటున్నారు.


Related News

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

Big Stories

×