BigTV English

Abraham Lincoln : లింకన్ గడ్డం వెనక చిన్నారి సలహా..!

Abraham Lincoln : లింకన్ గడ్డం వెనక చిన్నారి సలహా..!
Abraham Lincoln

Abraham Lincoln : అది 1860. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అబ్రహాం లింకన్ దేశమంతా ప్రచారం చేస్తున్నారు. ఆయన అభిమానుల్లో ఓ 11 ఏళ్ల పాప కూడా ఉంది. ఆ చిన్నారి పేరు.. గ్రేస్ బెడెల్. పార్టీ తరపున ప్రచురించిన పత్రంలోని లింకన్ ఫోటో చూసిన ఆ చిన్నారి బాగా నిరాశ పడింది.


బక్కపలచగా, పీక్కుపోయిన ముఖంతో ఉన్న లింకన్‌ను చూసిన ‘దేశాధ్యక్షుడు చూపులకూ.. కాస్త బాగుండాలిగా’ అనుకుంది. వెంటనే ఓ ఉత్తరం రాసేసింది. ‘మీరు అధ్యక్షుడు కావాలని నేను కోరుకుంటున్నా. అలాగే గడ్డం ఉన్న మగవారంటే ఆడవాళ్లకి ఇష్టం. కాబట్టి మీరు నా సలహాను గౌరవించి గడ్డం పెంచుకుంటే.. మహిళల ఓట్లు మీకు పెరుగుతాయి’ అని లేఖలో వివరించింది. అంతేకాదు క‌చ్చితంగా తిరుగు జ‌వాబు రాయాలని కోరింది.

1860 అక్టోబ‌ర్ 15న గ్రేస్ బెడెల్ లేఖ రాస్తే.. అక్టోబ‌ర్ 19న లింకన్ దీనికి జవాబిచ్చారు. ‘ఉన్నట్టుండి నేను గడ్డం పెంచుకుంటే జనం నన్ను పిచ్చోడిని అనుకుంటారేమో’.. అంటూనే ‘ మీ సలహాను పాటిస్తాను’ అని రాశారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. 1861 ఫిబ్రవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు వెళుతూ.. న్యూయార్క్‌లోని వెస్ట్‌ఫీల్డ్‌లో ఆగి.. చిన్నారి గ్రేస్‌ను కలిశారు. ‘చూశావా ! నీ కోస‌మే ఈ గ‌డ్డం పెంచుకున్నా’ అని తన పెరిగిన గడ్డాన్ని చూపించి, గ్రేస్‌కు థాంక్స్ చెప్పి మరీ వెళ్లారు. దటీజ్ లింకన్.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×