Konathala Ramakrishna : సీనియర్ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. అనకాపల్లిలో అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన ప్రశంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధిపై పవన్ కల్యాణ్‌కు స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. రాజీలేని పోరాటం చేసే వ్యక్తిత్వం ఆయనది. రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించాల్సి ఉందని అన్నారు.
పవన్ కల్యాణ్‌తో హైదరాబాద్‌లో ఆయన భేటీ అయ్యారు . వివిధ అంశాలపై జనసేన అధినేతలో ప్రత్యేకంగా ఆయన సమాలోచనలు చేశారు. రామకృష్ణ 2014లో వైసీపీకి రాజీనామా చేశారు .ఇంతవరకు ఆయన ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. తాజాగా జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.