BigTV English

Donald Trump | అమెరికా అధ్యక్ష అభర్థిత్వ ఎన్నికల్లో ట్రంప్ నోటి దురుసు.. తిప్పికొట్టిన నిక్కీ హేలీ!

Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంవత్సరంలో జరగబోయే ప్రెసిడెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ తరపున తానే అర్హుడైన అభ్యర్థిగా నిరూపించుకోవాలనే ఆత్రుతలో నోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

Donald Trump | అమెరికా అధ్యక్ష అభర్థిత్వ ఎన్నికల్లో ట్రంప్ నోటి దురుసు.. తిప్పికొట్టిన నిక్కీ హేలీ!

Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంవత్సరంలో జరగబోయే ప్రెసిడెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ తరపున తానే అర్హుడైన అభ్యర్థిగా నిరూపించుకోవాలనే ఆత్రుతలో నోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌ ముందంజలో ఉన్నా.. పార్టీలో చాలామంది నిక్కీ హేలీని సమర్థిస్తున్నారు.


భారత మూలాలున్న నిక్కీ హేలీని సమర్థించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె అసలు అమెరికా పౌరురాలు కాదని, అసల అధ్యక్ష పదవి కాదు కదా.. ఉపాధ్యక్ష పదవికి కూడా నిక్కీ హేలీ అర్హురాలు కాదని చెబుతున్నారు. శుక్రవారం అమెరికాలోని కాన్ కార్డ్ ప్రాంతంలో ట్రంప్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. “నిక్కీ హేలీకి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు. అసలు ఆమె వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా నిర్వర్తించలేదు,” అని అన్నారు.

ట్రంప్ అంతటితో ఆగలేదు. నిక్కీ హేలీ జాతి, పేరుపై వెటకారంగా మాట్లాడారు. నిక్కీ హేలీ అసలు పేరు నమ్రతా నిక్కీ రంధావా. ఆమె తల్లిదండ్రులు 1960లో అమెరికా వలస వెళ్లారు. 1972లో నిక్కీ హేలీ జన్మించారు. అయితే ట్రంప్ ఆమె పేరుని పదే పదే కావాలని తప్పుగా పలికారు. “నమ్రతా .. నింబ్రా ఏంటా పేరు. ఆమె అసలు అమెరికా పౌరురాలు కాద,” అని ట్రంప్ నిక్కీ హేలీని ఎద్దేవా చేశారు.


దీనికి సమాధానంగా నిక్కీ హెలీ కూడా ట్రంప్‌పై విరుచుకుపడింది.” ట్రంప్ ఒక ముసలిగాడు. ఆయనకు మానసిక సమస్యలున్నాయి. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఆయన ఏ విధంగానూ అర్హుడు కాడు,” అని నిక్కీ హేలీ చెప్పింది.

ట్రంప్ ఇలా నోటి దురుసుగా మాట్లాడడం మొదటిసారి కాదు. ఆయన ఇంతకుముందు కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుత ఉప అధ్యక్షురాలు కమలా హారిస్ గురించి కూడా ఇలాగే మాట్లాడేవారు. వారిపై జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు.

War of words, Donald Trump, Nikki Haley, Republican candidate, US Presidential election,

Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×