BigTV English

YS Sharmila : జగన్ సర్కార్‌ని తొలిసారి టార్గెట్ చేసిన షర్మిల.. ఊహించని రేంజ్‌లో సీరియస్..

YS Sharmila : వైసీపీ, టీడీపీ దొందు దొందేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గత నాలుగేళ్లలో రాష్టంలో అభివృద్ది జరగలేదన్నారు. విజయవాడలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. తనను నమ్మి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పదవిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, వైసీపీలు రాష్ట్రాన్ని పరిపాలించినా ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి‌లో వైసీపీ సర్కార్ ఉందని షర్మిల మండిపడ్డారు.

ఏపీకి రూ.పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని షర్మిల ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మైనింగ్‌ మాఫీయాలు రెచ్చిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అభివృద్ధి చేస్తామని రాష్ట్రంలో ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదని జగన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో పార్టీలు విఫలం అయ్యాయని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్‌కు పునర్ వైభవం తీసుకువస్తామని షర్మిల ప్రకటించారు. భూతద్దంలో చూసిన ఏపీలో అభివృద్ధి కనిపించదని ఆమె హేద్దేవా చేశారు.

రాష్ట్రానికి రాజధానిని నిర్మించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని షర్మిల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్వలాభం కోసం వైసీపీ,టీడీపీ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాయనన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధించటం కోసం మూకుమ్మడి రాజీనామాలు చేస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏమీ చేయలేదని విమర్శించారు. చంద్రబాబు ఏనాడు ఒక్కసారి అయిన ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయలేదని ఆరోపించారు. రాజధాని నిర్మిస్తామంటూ గ్రాఫిక్స్ ని చూపించి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆమె మండిపడ్డారు. వైఎస్ రెండు సార్లు పీసీసీ పదవి చేపట్టి సీఎం అయ్యారని గుర్తు చేశారు.

వైఎస్ ఆశయ సాధనకు అన్ని విధాలుగా కృషి చేస్తానని షర్మిల అన్నారు. నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు ఇచ్చిన కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ, వైసీపీ‌లు బీజేపీ పార్టీకి తొత్తులుగా మారాయని ఘాటూ విమర్శలు చేశారు. బీజేపీ దోస్తి కోసం టీడీపీ , వైసీపీ పోలవరాన్ని తాకట్టు పెట్టాయని మండిపడ్డారు. ఏపీలో 10 ఏళ్లలో ఒక్క మెట్రో కూడా నిర్మించలేదని . గత పదేళ్లలో ఏపీని అప్పులు ఊబిగా మర్చారని షర్మిల విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి షర్మిల ఆహ్వనించారు.

Tags

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×