E-Paper
Advertisement

Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. అలిపిరి వద్ద గుర్తించిన టీటీడీ ఉద్యోగి

Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. అలిపిరి వద్ద గుర్తించిన టీటీడీ ఉద్యోగి
Advertisement

తిరుమలలో మళ్లీ చిరుత కలకలం
అలిపిరి వద్ద గుర్తించిన టీటీడీ ఉద్యోగి
ఒక్కసారిగా ఆందోళన.. బైక్ ప్రమాదానికి గురవ్వడంతో గాయాలు
చిరుత సంచారంపై భక్తులను అప్రమత్తం చేసిన అధికారులు

తిరుమల, స్వేచ్ఛ: శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి వద్ద శనివారం ఒక చిరుత కనిపించింది. బైక్‌పై వెళుతున్న టీటీడీ ఉద్యోగి కంటపడింది. అయితే, చిరుత చూసిన సదరు ఉద్యోగి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో బైక్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో, బైక్ వెళ్లి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ కుమార్ అనే టీటీడీ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులకు సమాచారం అందగానే బాధిత వ్యక్తిని అంబులెన్స్ ద్వారా ఘటనా స్థలం నుంచి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ ఉద్యోగి చికిత్స పొందుతున్నాడు.

Advertisement

కాగా, చిరుత సంచరిస్తున్న విషయాన్ని టీటీడీ అధికారులు భక్తులకు తెలియజేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ అప్రమత్తం చేశారు. అలిపిరి సమీపంలో చిరుత సంచరిస్తోందని, తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు కూడా టీటీడీ అధికారులు సమాచారం చేరవేశారు. అటవీశాఖ అధికారులు కూడా తక్షణమే రంగంలోకి దిగి చిరుత జాడ కోసం గాలింపు మొదలుపెట్టారు. చిరుతను పట్టుకోవాలని అధికారులు భావిస్తున్నారు. బోన్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, చిరుత జాడను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో చిరుతల కలకలం
రాష్ట్రంలో ఈ మధ్య వరుసగా చిరుతల కలకలం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మునిసిపాలిటీలోని ముదిగల్లు గ్రామంలో శుక్రవారం ఓ చిరుత కలకలం రేపింది. గ్రామ సమీపంలోని ఓ కొండపై తిష్ట వేసి రాత్రి సమయాల్లో గ్రామంలోని ఇళ్ల సమీపంలో చక్కర్లు కొడుతోంది. దీంతో, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Also Read: సంక్రాంతి వరాలు ప్రకటించిన ప్రభుత్వం..పెండింగ్ బకాయిలు విడుదల

ఇప్పటికే పలువురు అధికారులకు సమాచారం ఇచ్చామని, కనీసం ఒక్కసారి కూడా గ్రామం వైపు అటవీశాఖ అధికారులు రాలేదని అంటున్నారు. పగలు, రాత్రి సమయంలో పెంపుడు జంతువులపై చిరుత గ్రామంలోకి ప్రవేశించి దాడులకు తెగబడుతోందని వారు వాపోతున్నారు. అంతకుముందు, శ్రీశైలంలోని పాతాళ గంగ సమీపంలో చిరుత ఒకరి ఇంట్లోకి ప్రవేశించింది. సీసీ కెమెరాల్లో కూడా ఈ దృశ్యాలు నమోదైన విషయం తెలిసిందే. అంతకుముందు నంద్యాల జిల్లా మహానంది సమీపంలో కూడా ఒక చిరుత పులి సంచరించింది.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×