E-Paper
Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్.. పులివెందులలో హింస మొదలు, వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్.. పులివెందులలో హింస మొదలు, వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు
Advertisement

Pulivendula:  టీడీపీ నేతలు ముందుగా చెప్పినట్టుగానే జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు కొద్ది గంటలకు ముందు పులివెందులలో హింస మొదలైంది. గుర్తు తెలియని వ్యక్తులు పలు వాహనాలు దగ్దం చేశారు. 3 కార్లు, 10 బైకులు ట్రాక్టర్ కు నిప్పుపెట్టారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు ముందు హింస

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్‌కు కొద్ది గంటలకు ముందు పులివెందులలో హింస చోటుచేసుకుంది. అర్ధరాత్రి తర్వాత పులివెందుల పట్టణంలోని శిల్పారామం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి సమీపంలోని ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. 10 టూ వీలర్స్, మూడు కార్లు, ఓ ట్రాక్టర్‌ ట్రాలీ అగ్నికి ఆహుతయ్యాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

పులివెందులలో వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు

Advertisement

అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే దాదాపు ఎనిమిది వాహనాలు పూర్తిగా దగ్గమయ్యాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌కు కొద్ది గంటలకు ముందు ఈ ఘటన జరగడంతో తీవ్ర కలకలం రేపింది. పులివెందుల శివారులోని ఉలిమెల గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి అనే వ్యాపారం హైదరాబాద్‌లో సెటిలైయ్యారు.

శిల్పారామం సమీపంలోని పొలం ప్రాంతంలో నివాసాన్ని నిర్మించారు. ఆయన ఇంటి సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పు పెట్టారు. వాహనాలు దగ్ధం కావడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనకు ముందు నిందితులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా దారుణమైన ఘటనగా పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

ALSO READ: ఏపీలో రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు!

ఇలాంటి ఘటనలు జరుగుతాయని పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల పోలింగ్ వేళ భారీ కుట్ర చేసేందుకు వైసీపీ స్కెచ్ వేసిందనివెల్లడించారు. మాజీ సీఎం జగన్, అవినాష్‌రెడ్డిలు మాటలు దీనికి ఎగ్జాంఫుల్ గా చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి పులివెందులకు గుండాలను రప్పించారని వివరించారు. దీనిపై మాకు స్పష్టమైన సమాచారం ఉందని తెలిపారు. పులివెందుల శివార్లలోని ఫామ్ హౌస్‌లో కొందరు వ్యక్తులు ఉన్నారని వివరించారు.

ఇన్యూరెన్సు వాహనాలను తీసుకొచ్చారని, వారి వాహనాలకు వారే నిప్పు పెట్టుకుని ప్రజల్లో ఓ అలజడి చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు మొదలైన నుంచి ఏదో విధంగా శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర, నేషనల్ మీడియాను పులివెందులకు ముందు రోజు పిలిపించారని గుర్తు చేశారు. వారి వాహనాలకు వారే నిప్పు పెట్టుకుని, ఇదంతా మేము చేస్తున్నట్లుగా వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

 

Related News

ఏపీలో ‘స్థానిక’ ఎన్నికల పోలింగ్ మొదలు.. కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు, భారీగా పోలీసులు మోహరింపు

ఏపీలో రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు!

రాప్తాడు, హర్యానా ఘటనలతో షాక్‌ తిన్న మానసిక నిపుణులు.. అసలు కారణం అదేనా?

ఏపీలో ముంచుకొస్తున్న మరో తుఫాన్.. సచివాలయంలో చంద్రబాబు అత్యవసర మీటింగ్!

తాజ్‌మహల్ చూసి నాదే అంటే ఇచ్చేస్తారా? షర్మిల ట్వీట్‌పై పేర్ని నాని సెటైర్లు!

ఓటు వేసి వెళ్లిపోవాల్సిందే..! జగన్ కు DIG వార్నింగ్

బంగాళాఖాతంలో భారీ వాయుగుండం.. రానున్న 24 గంటల్లో వర్షాలు!

Big Stories

Advertisement
×