E-Paper
Advertisement

ఏపీలో ముంచుకొస్తున్న మరో తుఫాన్.. సచివాలయంలో చంద్రబాబు అత్యవసర మీటింగ్!

ఏపీలో ముంచుకొస్తున్న మరో తుఫాన్.. సచివాలయంలో చంద్రబాబు అత్యవసర మీటింగ్!
Advertisement

Chandrababu Naidu: ఆర్నబ్ తుఫాను బీభత్సం నుంచి ఏపీ కోలుకోకముందే బంగాళాఖాతం మరోసారి విలయానికి సిద్ధమవుతోంది. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రంలో శనివారం సీఎం చంద్రబాబు అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఒకవైపు ఆర్నబ్ తుఫాను తెచ్చిపెట్టిన నష్టం నుంచి పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు ముంచుకొస్తున్న కొత్త గండంపై యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు.

బంగాళాఖాతంలో మరో వాయుగుండం

Advertisement

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా మరో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇది రేపటికి మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్రలోని గుంటూరు నుంచి దిగువ ప్రాంతాలు, అలాగే రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వివరించారు.

3 రోజుల పాటు భారీ వర్షాలు!

Advertisement

నవంబరు 2, 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉపగ్రహ చిత్రాలు, ఆధునిక డాప్లర్ రాడార్ వ్యవస్థ సాయంతో తుఫాను కదలికలను నిమిష నిమిషం పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు.

రెస్క్యూ టీమ్స్ సిద్ధం

ఏర్పడే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు విద్యుత్, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. వర్షాల సమయంలో టెలికాం సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆపరేటర్లకు సూచించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సహా పలు శాఖల ఉన్నతాధికారులు, వివిధ టెలికాం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా తీరప్రాంత జనం, రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Also Read: తాజ్‌మహల్ చూసి నాదే అంటే ఇచ్చేస్తారా? షర్మిల ట్వీట్‌పై పేర్ని నాని సెటైర్లు!

Tags

Related News

తాజ్‌మహల్ చూసి నాదే అంటే ఇచ్చేస్తారా? షర్మిల ట్వీట్‌పై పేర్ని నాని సెటైర్లు!

ఓటు వేసి వెళ్లిపోవాల్సిందే..! జగన్ కు DIG వార్నింగ్

బంగాళాఖాతంలో భారీ వాయుగుండం.. రానున్న 24 గంటల్లో వర్షాలు!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ!

రాప్తాడు ఘటనలో పురోగతి.. పోలీసుల అదుపులో నిందితుడు!

గుండెల్ని పిండేసే ఘటన.. పాఠశాలలో బాలికపై రంపంతో దాడి, సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

యలహంక ప్యాలెస్‌ నాదే.. దేవుడి సాక్షిగా ఇదే నిజం.. వైఎస్ షర్మిల సంచలన ప్రకటన!

Big Stories

Advertisement
×