E-Paper
Advertisement

రాప్తాడు, హర్యానా ఘటనలతో షాక్‌ తిన్న మానసిక నిపుణులు.. అసలు కారణం అదేనా?

రాప్తాడు, హర్యానా ఘటనలతో షాక్‌ తిన్న మానసిక నిపుణులు.. అసలు కారణం అదేనా?
Advertisement

School Violence: అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం జరిగిపోయింది. పదో తరగతి చదువుతోన్న బాలికపై పాఠశాల తరగతి గదిలోనే ఓ కుర్ర రాక్షసుడు రంపంతో దాడి చేశాడు. నెత్తుటి గాయాలతో ఆసుపత్రి పాలైన బాలిక పరిస్థితి విషమంగానే ఉంది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మరో వైపు హరియాణాలో ఎనిమిదేళ్ల బాలుడు ఆరేళ్ల బాలికపై అత్యంత పైశాచికంగా కొట్టి హింస పెట్టాడు. మనుషుల్లో ఇంతటి హింస ఎక్కడి నుంచి వస్తోంది? దీనికి కారణాలేంటి? అన్నవి మానసిక శాస్త్రవేత్తలను సైతం కంగారు పెడుతున్నాయి.

పట్టపగలే పాఠశాలలో..

అనంతపురం జిల్లా రాప్తాడులో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న బాలికపై హేమంత్ అనే ఉన్మాది రంపంతో దాడి చేశాడు.ఈ దాడిలో ఆమె చేయి తెగిపోయింది. ముఖంపైనా తీవ్ర గాయాలయ్యాయి. నెత్తుటి మడుగులో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన హేమంత్ బాలికకు బంధువే అంటున్నారు. పోలీసులు హేమంత్ ను ధర్మవరం రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంత దారుణంగా పట్టపగలే పాఠశాలలో కౄరాతి కౄరంగా దాడి చేయడం వెనుక కారణాలేంటన్నవి ఇంకా తెలీలేదు. కాకపోతే ఇంతటి హింసకు ఏ కారణాన్నీ కూడా క్షమించలేం. బాలికపై దాడి ఘటన గురించిన సమాచారం అందగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక తల్లిదండ్రులతో చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. నిందితుణ్ని కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. మరో వైపు రాప్తాడు ఘటనను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖండించారు.

హరియాణాలో..

Advertisement

రాప్తాడు ఘటనను మించిన దారుణం హరియాణాలో చోటు చేసుకుంది. హరియాణాలోని పంచకులలో ఓ మోడల్ స్కూల్ లో ఎనిమిదేళ్ల బాలుడు ఆరేళ్ల బాలికపై ఎవరూ ఊహించనంతటి దారుణంగా పైశాచికంగా దాడి చేశాడు. ముందుగా బాలికను టేబుల్ కేసి కొట్టిన బాలుడు ఆ తర్వాత ఆమెను కింద పడేసి కాలితో పదేపదే తన్నాడు. ఇటుక, పూల కుండీలతో దారుణంగా కొట్టాడు. ఓ సారి కొట్టి ముందుకు వెళ్లిన బాలుడు మళ్లీ వెనక్కి తిరిగి వచ్చే చితక బాదాడు. పూనకం వచ్చినట్లు పాపం ఆ చిన్నారి ఊపిరి పీల్చుకునే వీలు కూడా లేకుండా కొడుతూనే ఉన్నాడు.

ఇంత హింస ఏంటి?

ఇంత చిన్న వయసులో ఇంత హింస ఏంటి? అణువణువూ హింసను నింపుకున్నట్లు రాక్షసంగా కొట్టడం చూస్తే మానసిక పరిస్థితిలో ఏమైనా తేడా ఉందా అనిపిస్తుంది. అన్నింటికన్నా భయంకరమైన వాస్తవం ఏంటంటే నెత్తురోడేలా కొట్టిన ఈ బాలుడే బాలిక స్పృహ తప్పి పడిపోగానే ఆ బాలిక ఇంటికి వెళ్లి మీ అమ్మాయి అక్కడ పడి ఉందని చెప్పి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత సిసి ఫుటేజ్ చూస్తే అసలు రాక్షసుడు ఈ పసిబాలుడే అని తేలింది. అక్టోబరు 28న జరిగిన ఈ దుర్మార్గం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పిల్లలు పగలతో పెరుగుతున్నారా?

Advertisement

పాలు తాగి పెరగాల్సిన పిల్లలు పగలతో పెరుగుతున్నారా? ఇంతటి హింసను ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? స్మార్ట్ ఫోన్లు హర్రర్ సీరియల్సూ చూసి ప్రభావితం అవుతున్నారా? పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే పిల్లల్లో ఇటువంటి రుగ్మతలే వస్తాయంటున్నారు నిపుణులు.

Also read: ‘ఇట్లు అర్జున’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలకు మోక్షం దక్కేనా?

Tags

Related News

ఏపీలో ముంచుకొస్తున్న మరో తుఫాన్.. సచివాలయంలో చంద్రబాబు అత్యవసర మీటింగ్!

తాజ్‌మహల్ చూసి నాదే అంటే ఇచ్చేస్తారా? షర్మిల ట్వీట్‌పై పేర్ని నాని సెటైర్లు!

ఓటు వేసి వెళ్లిపోవాల్సిందే..! జగన్ కు DIG వార్నింగ్

బంగాళాఖాతంలో భారీ వాయుగుండం.. రానున్న 24 గంటల్లో వర్షాలు!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ!

రాప్తాడు ఘటనలో పురోగతి.. పోలీసుల అదుపులో నిందితుడు!

గుండెల్ని పిండేసే ఘటన.. పాఠశాలలో బాలికపై రంపంతో దాడి, సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×