Smart air fryers: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై.. ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా నూనె పదార్థాలను తగ్గించి,హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే.. నూనె లేకుండా వంటలు చేసుకోవడం ఎలా అనే ప్రశ్నకు సమాధానమే ‘ఎయిర్ ఫ్రైయర్’. పండగలు, ప్రత్యేక రోజుల్లో.. పిండివంటలు, స్నాక్స్ చేయడానికి ఎక్కువ నూనె వాడుతుంటాము.కానీ ఈ స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్‌లు ఉంటే.. కేవలం ఒక్క చుక్క నూనెతో లేదా అసలు నూనె లేకుండానే.. ఎంతో రుచికరమైన, క్రిస్పీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. హాట్ టాపిక్‌గా ఉన్న టాప్-5 స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్ బ్రాండ్లు , వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.ఫిలిప్స్ బ్రాండ్ ఎయిర్ ఫ్రైయర్ మార్కెట్లో చాలా ఫేమస్. ఇది రాపిడ్ ఎయిర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని వల్ల ఆహారం నలుమూలలా సమానంగా వేగుతుంది. ఇందులో.. ఉండే వివిధ రకాల ఆటో-కుక్ మెనూల ద్వారా కేక్, స్నాక్స్, చికెన్ రోస్ట్ వంటివి క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. దీని డిజైన్ చాలా ప్రీమియమ్‌గా ఉంటుంది. దీని అంచనా ధర సుమారు రూ.8,000 నుంచి రూ.12,000 మధ్య ఉంటుంది.
2.ఇన్సాల్సా ఎయిర్ ఫ్రైయర్ డిజిటల్ టచ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇది కిచెన్‌కు ఒక మోడ్రన్ లుక్‌ను ఇస్తుంది. ఇందులో చాలా ఆటో-కుక్ ఆప్షన్లు ఉండటం వల్ల ఉష్ణోగ్రత, టైమ్‌ను ప్రత్యేకంగా సెట్ చేయాల్సిన పని లేదు, సింగిల్ టచ్‌తో వంట పూర్తవుతుంది. దీని కెపాసిటీ కుటుంబ సభ్యులందరికీ సరి పోతుంది. దీని ధర సుమారు రూ. 5,000 నుంచి రూ.7,000 మధ్య ఉంటుంది.
3.మియాబో లేదా నూజువల్ బ్రాండ్లకు బదులుగా ఇండియాలో విపరీతంగా అమ్ముడవుతున్న మరో గొప్ప బ్రాండ్ అగ్రో రాయల్ ఎయిర్ ఫ్రైయర్. ఇది పవర్ ఫుల్ మోటార్‌తో వేగంగా వేడి చేస్తుంది. ఇందులో ఉండే డిజిటల్ డిస్‌ప్లే , స్మార్ట్ కంట్రోల్స్ వంటను చాలా ఈజీ చేస్తాయి. దీని అంచనా ధర సుమారు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ఉంటుంది.
Also Read: ఆపిల్ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇండియాలో విడుదల..ధర,ఫీచర్ల పూర్తి వివరాలు!
4.నాయిస్ లేదా ఇతర ప్రముఖ టెక్ బ్రాండ్ల మార్గంలో క్వాలిటీ గాడ్జెట్లను అందిస్తున్న వుల్ఫ్ ఎయిర్ ఫ్రైయర్ కూడా బెస్ట్. ఇది స్మార్ట్ ఎకో మోడ్ , సేఫ్టీ ఆటో కట్-ఆఫ్ ఫీచర్‌తో వస్తుంది. ఇరుకైన కిచెన్ లో కూడా సర్దుకునే కాంపాక్ట్ సైజ్‌లో ఇది లభిస్తుంది. దీని ధర సుమారు రూ.5,500 నుంచి రూ. 7,500 మధ్య ఉంటుంది.
5.ఇన్‌స్టాపోట్ లేదా అమెజాన్ బేసిక్స్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ బడ్జెట్ ధరలో.. లభించే బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్ ఆటో-కుక్ మెనూలు కోరుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఇది శుభ్రం చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీని ధర సుమారు రూ. 4,500 నుంచి రూ.6,000 మధ్య ఉంటుంది.
ఈ పండగ సీజన్‌లో కిచెన్ లో గంటల తరబడి కష్టపడే పని లేకుండా.. ఈ స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్‌లలో ఏదో ఒకదాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆటో-కుక్ మెనూల సహాయంతో రుచి కరమైన, ఆరోగ్య కరమైన వంటకాలను చిటికెలో తయారుచేసి మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచండి!