అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో ఉన్న 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారును.. అటుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయ. అనంతపురంలోని సంగమేశ్వర్ నగర్ కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. గుత్తికి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నరాయల్ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ కారును ఢీ కొట్టింది.
ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మృతుల్లో పదేళ్ల వయసుగల చిన్నారులు స్పాట్ లోనే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురికి గాయాలవ్వగా వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటనపై గుత్తి సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.