Madhuri Challenge to Duvvada Vani: దువ్వాడ శ్రీనివాస్ – వాణి – మాధురి వ్యవహారం ముదురుతోంది. శ్రీనివాస్ తో కలిసి ఉండే హక్కు తమకే ఉందని వాణి, కూతురు హైందవి అంటుండగా.. వాణి.. శ్రీనివాస్ ను టార్చర్ పెట్టిందని ఆరోపించింది మాధురి. తన పిల్లల గురించి మాట్లాడే హక్కు వాణికి లేదంటూనే సవాల్ చేసింది. వాణి తన పిల్లలిద్దరికీ డీఎన్ఏ టెస్టులు చేయించాలని, తను కూడా డీఎన్ఏ టెస్టులు చేయిస్తానని ఛాలెంజ్ చేసింది.
తను టెక్కలికి చెందిన మహిళనేనని, ఈ ప్రాంతాన్ని వదిలి ఎక్కడికి వెళ్లబోనని, తనను తరిమేయడానికి వాణికి ఏం హక్కులున్నాయని మీడియా ముఖంగా ప్రశ్నించింది మాధురి. శ్రీనివాస్ కు తనకు మధ్యనున్నది హెల్దీ రిలేషన్ షిప్ అని చెప్పింది. దానిని లివ్ ఇన్ అనుకుంటారో, అడల్ట్రీ అనుకుంటారో మీ ఇష్టానికే వదిలేస్తున్నా అని మీడియాకు స్పష్టం చేసింది.
దువ్వాడ శ్రీనివాస్ 60 ఏళ్ల వయసులో 30 ఏళ్లు కాపురం చేసిన భార్యను వదిలి వచ్చారంటే.. ఆమె ఎంత టార్చర్ పెట్టి ఉంటుందో అర్థం చేసుకోవాలని నీతులు చెప్పారు. భోజనంలో పాయిజన్ కలిపి పెట్టడం, ఆయన ముఖంపై తలగడ పెట్టి ఒత్తడం వంటివి చేసిందని, డంబెల్స్ పెట్టి కొట్టినట్లు కూడా ఆయన ఇంటిలో పనిచేసిన కుర్రాడు చెప్పాడని వాపోయింది.
Also Read: లోగుట్టు బయటపెట్టిన దువ్వాడ శ్రీను, జగన్.. బ్లాక్ మెయిల్ చేసింది వాణి
రెండు నెలల క్రితం ఎలక్షన్లో, గడపగడపకు కార్యక్రమంలో సహాయం చేసేందుకు ఆయన వద్దకు వెళ్లానని, అప్పట్నుంచీ అక్కడే ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది మాధురి. దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు కట్టుకునేందుకు రూ.2 కోట్లు అప్పు ఇచ్చానని, ఆ అప్పు తీరేంతవరకూ ఆ ఇంటిలోనే ఉంటానని భీష్మించింది. తామిద్దరి మధ్య ఈ మేరకు అగ్రిమెంట్ జరిగిందని తెలిపింది.
దువ్వాడ వాణికి మెంటల్ డిజార్డర్ ఉందని, ఆమెకు మెడికల్ టెస్టులు చేయించి పిచ్చాసుపత్రికి పంపాలని చెప్పింది మాధురి. వాణికి పోటీగా రేపు ఉదయం నుంచి తాను కూడా టెక్కలి వెళ్లి దీక్ష చేస్తానని చెప్పింది. వాణి వచ్చి క్షణాపణ చెబితేనే తాను దీక్ష విరమిస్తానని తెలిపింది. మరి ఈ నారీ నారీ నడుమ మురారి వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో.. ఎక్కడ తెగుతుందో చూడాలి.