E-Paper
Advertisement

మరోసారి పాకిస్తాన్, టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే? రివేంజ్‌కు సిద్ధమవుతున్న వైభవ్

మరోసారి పాకిస్తాన్, టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే? రివేంజ్‌కు సిద్ధమవుతున్న వైభవ్
Advertisement

IND VS PAK:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ ( ACC Men’s Asia Cup Rising Stars 2026 ) నేపథ్యంలో టీమిండియా జూనియర్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు తెలుగోడు తిలక్ వర్మను ( Tilak Varma) కెప్టెన్ చేయగా, రజత్ పటిదార్ కు వైస్ కెప్టెన్సీ అందించారు. వికెట్ కీపర్లుగా కుమార్ కుశాగ్రా, ప్రభ్ సిమ్రన్ సింగ్ ను తీసుకున్నారు. అభిషేక్ శర్మ, షెహబాజ్ అహ్మద్, తనుష్ కోటియాన్, సూర్యాన్ష్ షెడ్గే, హర్ష్ దూబేలను ఆల్ రౌండర్లుగా తీసుకున్నారు. అటు బౌలర్లుగా హర్షిత్ రాణా, అర్షద్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, విప్రాజ్ నిగమ్ లను తీసుకుంది బీసీసీఐ. ఈ మేరకు బీసీసీఐ 15 మంది సభ్యుల పేర్లను రిలీజ్ చేసింది.

ఒరేయ్ వైభవ్..ఇక పాకిస్తాన్ పై రివేంజ్ తీర్చుకో

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నవంబర్ 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అంటే దాదాపు 10 రోజుల పాటు కొనసాగనుంది. ముఖ్యంగా పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా (IND VS PAK) మధ్య నవంబర్ 22వ తేదీన మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. జపాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడలు 2026 ఫైనల్స్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీని సైమ్ అయూబ్ ( Saim Ayub) రెచ్చగొట్టాడు.

Advertisement

వికెట్ తీసిన ఆనందంలో జోల పాట పాడుతూ వైభవ్ ను ట్రోల్ చేశాడు. 15 ఏళ్ల బుడ్డోడా అంటూ హేళన చేశాడు.  అయితే, ఆ పగను తీర్చుకునే సమయం వైభవ్ కు వచ్చిందని చర్చ మొదలైంది. నవంబర్ 22వ తేదీన జరిగే మ్యాచ్ లో పాక్ బౌలర్లను ఉతికారేయాలని, సెంచరీ చేసి రివేంజ్ తీర్చుకోవాలంటూ ఇండియన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఎక్కడైతే అవమానం జరిగిందో, అక్కడే నిలబడి ప్రత్యర్థికి చుక్కలు చూపించాలని వైభవ్‌కు సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో వైభవ్ పేరు మళ్లీ మారుమోగుతోంది.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 షెడ్యూల్, స్ట్రీమింగ్ వివరాలు

Advertisement

నవంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ వన్డే ఫార్మాట్ లో జరుగనుంది. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్డర పడుతున్న తరుణంలో 50 ఓవర్ల ఫార్మాట్ లో ఆసియా కప్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు ఖతార్ లోని దోహా వేదికగా జరుగుతాయి. ఇండియాలో ఈ మ్యాచ్ లను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ , సోనీ లివ్ యాప్ లలో లైవ్ చూడవచ్చును.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

ఛీ..ఛీ.. ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్.. నా కాళ్లు మొక్కినా ఆడను!

బీసీసీఐ డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి, 3-2 తేడాతో కావాల‌నే న్యూజిలాండ్ ఓడిపోయింది!

కేఎల్ రాహుల్ కు దూల ఎక్కువ‌..టీమిండియా ప్లేయ‌ర్ల హోట‌ల్ బిల్ అంతా క‌ట్టేస్తాడు!

టీమిండియాలో నో ఛాన్స్‌…దిక్కులేక ఆర్మీలో చేరిన శివ‌మ్ దూబే!

పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా రాక‌పోతే, బీసీసీఐ రోడ్డున ప‌డుతుంది

తాగే నీళ్ల‌లోనూ విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న నీతా అంబానీ!

దావూద్ ఇబ్రాహీంను డ్రెస్సింగ్ రూం నుంచి గెంటేసిన టీమిండియా క్రికెట‌ర్

Big Stories

Advertisement
×