BigTV English

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిని నరికి చంపిన వైనం.. అడ్డొచ్చిన భార్యపై..?

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిని నరికి చంపిన వైనం.. అడ్డొచ్చిన భార్యపై..?

Murder in Prakasam District: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది. నికరంపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా నరికి చంపారు. వెంకటేశ్వర్లు ఇంట్లో నిద్రిస్తుండగా.. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడిన కాశీరామిరెడ్డి అనే యువకుడు.. గొడలితో దాడి చేశాడు. భర్త వెంకటేశ్వర్లుపై దాడిని చూసి అడ్డు వచ్చిన అతని భార్య తిరుపతమ్మపై కూడా అదే గొడ్డలితో దాడి చేశాడు. ఆమె చేతిని నరికేశాడు. కాశీరామిరెడ్డి దాడిలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతని భార్య తిరుపతమ్మ తీవ్రంగా గాయపడింది.


Read More: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడివున్న తిరుపతమ్మను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వర్లు హత్య అనంతరం.. నిందితుడు కాశీరామిరెడ్డి పరారయ్యాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×