Posani: వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికు కష్టాలు రెట్టింపు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 17 కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఆయా స్టేషన్లకు సంబంధించిన పోలీసులు పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. వాటిలో గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు జైలు అధికారికి వారెంట్లు అందజేశారు.
ఇదిలాఉండగా నరసారావుపేట స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు అయ్యింది. పీటీ వారెంట్‌తో రాజంపేట సబ్ జైలుకు నరసరావుపేట పోలీసులు చేరుకున్నారు. రాజంపేట సబ్ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట నుంచి నరసరావుపేటకు ఆయన్ని తరలిస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం నరసరావుపేట కోర్టులో పోసానిని హాజరు పరిచనున్నారు పోలీసులు. కోర్టులో హాజరు పరిచిన తర్వాత న్యాయస్థానం నిర్ణయం మేరకు నరసారావుపేట సబ్ జైలులో ఉంచుతారా? రాజంపేటకు తరలిస్తారా అనేది చూడాలి. నాలుగు రోజులుగా పోసాని రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా పలువురు నేతలపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు పోసాని. గతవారం పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన వ్యాఖ్యల ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలో విభేదాలు సృష్టించారంటూ ఆయనపై జనసేన నేత జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ అయిన విషయం తెల్సిందే.
రాజంపేట సబ్ జైలు నుంచి పోసానిని నరసరావుపేటకు తీసుకెళ్లిన పోలీసులు
నరసరావుపేటలో పోసానిపై మరో కేసు నమోదు
153A,504,67 ఐటీ యాక్ట్ కింద పోసానిపై కేసు నమోదు
PT వారెంట్ పై పోసానిని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు
మధ్యాహ్నం నరసరావుపేట కోర్టులో పోసానిని హాజరు పరిచే అవకాశం pic.twitter.com/uwICGGvtl5
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025