KKR Jersey: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )
కోసం సిద్ధమవుతోన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ).. కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు కొత్త జెర్సీని ఆవిష్కరించింది కోల్‌కతా నైట్ రైడర్స్. కేకేఆర్ జెర్సీ ( Kolkata Knight Riders Jersy) లాంచ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కోల్‌కతా.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక జెర్సీ లాంచ్ వీడియోలో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్లు అందరూ కనిపించారు. రహానే, వెంకటేష్ అయ్యర్, రింకూసింగ్ , వరుణ్ చక్రవర్తి లాంటి తోపు ప్లేయర్లు అందరూ కొత్త జెర్సీని ధరించి కనిపించారు. దీంతో… జెర్సీ లాంచ్ వీడియో వైరల్ గా మారింది. ఇక జెర్సీ లాంచ్ వీడియోను చూసిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
Also Read: Travis Head: సెమీస్ పోరు..ఇండియాను వణికిస్తున్న కుంభకర్ణుడు..గెలవడం కష్టమేనా?
ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో చాంపియన్ గా కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ).. నిలిచింది. ఈ సారి కూడా ఛాంపియన్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా… ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ కెప్టెన్ ను ప్రకటించలేదు. మొన్నటి వరకు… శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి వేలంలో అతన్ని వదిలేసింది కోల్‌కతా నైట్ రైడర్స్. దీంతో శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా కెప్టెన్ పదవి కూడా ఇచ్చింది.
ఈ తరుణంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఎవరు అనే దాని పైన ఇంకా యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అజింక్య రహనే లాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై మరో వారం రోజుల్లో ప్రకటన చేసే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ప్రారంభ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉండనుంది.
KKR జట్టు సభ్యులు
KKR IPL 2025 జట్టులో రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రానా , హర్షిత్ రానా, వెంకటేష్ అయ్యర్ , క్వింటన్ డి కాక్ (రూ. 3.60 కోట్లు), రహమానుల్లా గుర్బాజ్ , అన్రిచ్ నార్ట్జే, అంగ్క్రిష్ రఘువంశీ, వైభవ్ అరోరా, , రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే , స్పెన్సర్ జాన్సన్, లువ్నిత్ సిసోడియా, అజింక్యా రహానె , అనుకుల్ రాయ్ , మాలీక్ ఉన్నారు.
Also Read:ophy semis: టీమిండియాకు కొత్త టెన్షన్..ఆస్ట్రేలియాతోనే ఫైట్…సెమీస్ వేదికలు, టైమింగ్స్ ఇవే ?
In the 𝟯-𝗦𝘁𝗮𝗿𝗿𝗲𝗱 (𝗞)𝗻𝗶𝗴𝗵𝘁 𝗦𝗸𝘆 lies the greatest championship story from the city of joy ⭐️⭐️⭐️
🚨 2025 NEW JERSEY LAUNCHED: Buy it from 👉 https://t.co/BJP0u8H2x9 pic.twitter.com/aEbfYjh429
— KolkataKnightRiders (@KKRiders) March 3, 2025