Fire Accident in AP: ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మండవల్లి మండలం బైరవపట్నంలో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. అయితే దోమల నివారణకు వెలిగించిన అగరబత్తీల కారణంగా ప్రమాదం జరిగింది. కాగా.. దోమల అగరబత్తీల నుంచి.. నిప్పురవ్వలు చెలరేగి.. క్షణాల్లోనే మంటలు వ్యాప్తించాయి.
ఇదే టైంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో 20 గుడిసెలు దగ్ధం అయ్యాయి. మంటల్లో చిక్కుకున్న ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ముగ్గురు చిన్నారులు, మహిళ సహా ఆరుగురు ఉన్నారు. వెంటనే క్షతగాత్రులను కైకలూరు ఏరియా ఆస్పత్రికి తరలించి ట్రిట్మెంట్ అందిస్తున్నారు. మంటల్లో ఇళ్లు పూర్తిగా ఖాళీపోయాయి.
Also Read: వీఎస్ఆర్ సాయం.. రేసులో కిరణ్ కుమార్‌రెడ్డి, చిరంజీవి
శ్రీకాకుళం లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూర్యామహళ్ జంక్షన్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అగ్నికీలలు ఎగిసిపడతున్నాయి. దీంతో షాపింగ్ మాల్ పరిసర ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. షాపింగ్ మాల్ లోని విలువైన వస్త్రాలు తగలబడుతున్నాయి.ఘటనా స్థలికి రెండు ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి.మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.