Prashanth varma : చిన్న సినిమాగా వచ్చి పెద్ద హీరోలకు పోటీ ఇస్తూ సంక్రాంతి మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది హనుమాన్(Hanuman). ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ (Prashanth varma) దర్శకత్వం వహించారు. ఇందులో తేజా సజ్జ (Teja sajja) హీరోగా నటించారు. చిన్న సినిమాగా వచ్చినా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి, ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈయన పేరు బాగా మారుమ్రోగిపోయింది. దీంతో చాలామంది ఈయనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా తెగ హడావిడి చేశాడు.
వరుస సినిమాలతో బిజీగా మారిన ప్రశాంత్ వర్మ..
అందులో భాగంగానే ‘బ్రహ్మరాక్షస’ అనే ఒక టైటిల్ తో స్టోరీని పట్టుకొని మొదట బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ (Ranvir Singh) తో కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు మొదలుపెట్టాడు. కథా చర్చలు కూడా జరిగాయి . అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత రిషబ్ శెట్టి (Rishab Shetty) తో ‘జై హనుమాన్’ మొదలుపెట్టాడు. అలాగే సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ‘మహంకాళి’ అనే మూవీని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి కూడా స్టోరీ అందిస్తున్నారు ప్రశాంత్ వర్మ. దీనికి తోడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ(Moshagna) తో డెబ్యూ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.
మరో హీరో చెంతకు చేరిన బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్..
ఇలా వరుస పెట్టి ఒక సినిమా తర్వాత మరొకటి ప్రకటిస్తున్నాడు కానీ ఇంకా ఏవి కూడా పూర్తి అయినట్టు కనిపించడం లేదు. దీనికి తోడు తన డ్రీమ్ ప్రాజెక్టు ‘బ్రహ్మ రాక్షస’ పై కూడా ఫుల్ పోకస్ పెట్టాడు కానీ పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా రణవీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్టు ప్రభాస్ (Prabhas) చెంతకు వచ్చిందని సమాచారం. అక్కడ కూడా ఒప్పుకోకపోవడంతో.. ఇప్పుడు బాహుబలి నుండి భళ్లాల దేవకు చేరిందని తెలుస్తోంది.టాలీవుడ్ లో విలన్ క్యారెక్టర్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన రానా (Rana) కి ప్రశాంత్ వర్మ చెప్పిన కథ బాగా నచ్చిందని, అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బ్రహ్మ రాక్షస సినిమా ఎక్కువగా నెగటివ్ షేడ్స్ లో ఉంటుందని, ఈ పాత్రలో దగ్గుబాటి వారసుడైతే కచ్చితంగా పూర్తి న్యాయం చేస్తాడు అనే కోణంలో ఆలోచించి, రానాకు వినిపించగా.. రానా కూడా ఈ కథకు ఒకే చెప్పినట్లు సమాచారం. ఇకపోతే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రతి నాయకుడిగా రానా మరొకసారి ఆకట్టుకోబోతున్నాడని చెప్పవచ్చు. మరి ప్రశాంత్ వర్మ తాను అనుకున్న స్టోరీకి సరైన హీరో దొరికినట్లేనా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఒకవైపు మోక్షజ్ఞ ఇంకొక వైపు డ్రీం ప్రాజెక్ట్..
ఇకపోతే బ్రహ్మ రాక్షస స్టోరీకి రానా సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సర్వం సిద్ధం చేశారు ప్రశాంత్ వర్మ. ఇలాంటి సమయంలో బాలకృష్ణ కొడుకును పక్కనపెట్టి తన డ్రీమ్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు అంటే బాలయ్య అభిమానుల నుండి పూర్తి వ్యతిరేకత నెలకొంటుంది మరొకవైపు తన డ్రీమ్ ప్రాజెక్టును పక్కకు పెట్టి మోక్షజ్ఞ మూవీని సెట్ పైకి తీసుకొస్తే.. భవిష్యత్తులో తన డ్రీమ్ ప్రాజెక్టుకి మళ్ళీ రానా డేట్స్ ఇవ్వకపోవచ్చు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారిపోయింది ప్రశాంత్ వర్మ పరిస్థితి. మరి ప్రశాంత్ వర్మ పయనం ఎటువైపో తెలియాల్సి ఉంది.